AADIVAVRAM - Others

కానీ... (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కానీ..’
అన్న పదం ఎలా పుట్టిందో తెలియదు. దానికి ఎక్కువ విలువని ఇస్తాం. ఈ వాక్యం చెప్పే సందర్భంలో కానీ అవసరమే కానీ చాలా సందర్భాల్లో అది అనవసరం.
ఈ పదంతోనే చాలామంది జీవితాలు ముగుస్తాయి.
నిరాశా, నిస్పృహలకి లోను కావడానికి ఈ పదమే ఎక్కువ దోహదం చేస్తుంది.
చాలామంది ఎన్నో పనులని చేద్దామని అనుకుంటారు.
కానీ.. దగ్గర ఆగిపోతారు.
ఉదయానే్న లేద్దామని అనుకుంటారు. కానీ...
క్రమం తప్పకుండా నడక సాగిద్దామని అనుకుంటారు కానీ ఉదయం నాలుగు గంటలకి లేచి చదువుకుందామని అనుకుంటారు, కానీ...
అమ్మకి వంట గదిలో సహాయం చేద్దామని అనుకుంటారు.
కానీ..
అదే విధంగా నాన్నకి బయటి పనుల్లో సహాయం చేద్దామని అనుకుంటారు. కానీ...
ఆహారం ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటారు, కానీ..
వ్యాపారం ప్రారంభిద్దామని అనుకుంటారు కానీ..
రిస్క్ తీసుకొని ముందుకు కొనసాగాలని అనుకుంటారు. కానీ...
ఇట్లా ఎన్నో విషయాలని చెప్పుకుంటూ పోవచ్చు.
కానీ...
చెప్పదల్చుకోలేదు.
ఎవరికి వారు ఊహించుకోవచ్చు.
తమకి తాము అన్వయించుకోవచ్చు.
ప్రతి విషయానికి ఒక సాకు ఉంటుంది.
చేయలేని ప్రతి పనికి ఓ నెపం ఉంటుంది.
ఈ నెపాన్ని ఎవరి మీదకో ఒకరి మీదకు త్రోసివేయవచ్చు.
సాకులు చెప్పుకొని ఇతరులని సంతృప్తి పరచవచ్చు.
ఒక్క క్షణం, ఒంటరిగా
కారణాలని అనే్వషిస్తే...
మనలోకి మనం తొంగి చూసుకుంటే మన మనస్సు అద్దంలో మన ప్రతిరూపమే కన్పిస్తుంది.
మనం ఏ చిన్న విజయం సాధించాలన్నా ఈ ‘కానీ’ని ముందుగా మనం జయించాలి.
‘కానీ...’ని జయిస్తే విజయం వైపు మన ప్రయాణం కొనసాగుతుంది.
మన కలలు సాఫల్యం చెందుతాయి.
ఆ ప్రయత్నం ఈ క్షణం నుంచే ప్రారంభిద్దాం.

- జింబో 94404 83001