Others

భలే కౌంటర్ వేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి నేహా ధూపియా ప్రస్తుతం హాలిడే టూర్‌లో బిజీగా ఉంది. ఐబిజా దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న నేహ.. తన హ్యాపీనెస్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది. పనిలోపనిగా బీచ్‌లో తీసుకున్న బికినీ సౌందర్యాన్నీ అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో పెట్టింది. అయితే.. నేహా పోస్ట్‌కి ప్రశంసలకంటే రివర్స్ కామెంట్లే ఎక్కువ పడ్డాయట. బికినీ పిక్స్ మీద కొంత ఘాటుగానే కామెంట్లు పోస్ట్ చేశారట. -ముల్లుని ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అనుకున్న నేహ.. బికినీ కామెంట్స్‌కు బికినీ ఫొటోలతోనే పవర్ పంచ్ సమాధానమిచ్చింది. అదెలా అంటే -‘హేయ్.. ఇక్కడా బికినీ వేసింది నేనే. బీచ్‌లో తిరిగేవారంతా సహజంగా బికినీలోనే ఉంటారు. సెల్ఫీ తీసుకున్నా.. పోస్ట్ చేస్తున్నా. సాధారణంగా సెలబ్రిటీలపై ఉండే అసహనాన్ని, అసూయను పక్కనపెట్టేసి ఫొటోలను ఎంజాయ్ చేయండి’ అంటూ స్ట్రాంగ్ కామెంట్ పోస్ట్ చేసింది. తర్వాత కామెంట్లు చేసిన వారికి కొంచెం ఘాటు వార్నింగ్ ఇస్తూ.. ‘మిమ్మల్ని అన్ ఫాలో చేయగలను. కామెంట్స్ డిలీట్ చేసే అవకాశమూ నాకు ఉంది. మీ కామెంట్స్‌పై రిపోర్ట్ కూడా చేయగలను. అయినా అవేమీ చేయడం లేదు. నా పిక్స్ మీకు అమర్యాదగా అనిపిస్తే.. నెక్ట్స్‌కి స్క్రోల్ చేయండి. మీకు ఆ అవకాశం ఉంది. అనవసరంగా టైం, ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండి. ధాంక్యూ విత్ లవ్ ఆల్వేస్’ అంటూ స్ట్రాంగ్ పంచ్ పడేసింది నేహా.