Others

‘ఓ దేవదా!...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

65 ఏళ్ళయినా, ఒక అద్భుతం
====================

* జూన్ 26-1953 విడుదల సందర్భంగా..

65 ఏళ్ళ కాలప్రయాణంలో, భారత చలనచిత్ర రంగంలో మూకీ-టాకీ సినిమా ప్రపంచంలో, అరుదైన విశేష ప్రేక్షక ఆదరణ పొందిన తెలుగు దేవదాసు, చిత్రానికి ఎన్నో రికార్డులు సాధించిన ఘన చరిత్ర వుంది. అక్కినేని, సావిత్రి, లలిత, పేకేటి, ఎస్.వి.రంగారావు, సి.ఎస్.ఆర్, దొరస్వామి, ఆర్ని సత్యనారాయణ, ఆర్.నాగేశ్వరరావు, జి.వి.జి.కృష్ణ, సీతారామ్, సురభి కమలాబాయి, సీత, చంద్రకుమారి, అన్నపూర్ణాదేవి, సుధాకర్, బేబీ అనురాధ 17 మంది నటీనటులు చిన్న, పెద్దా పాత్రలలో జీవించిన ఈ చిత్రం శరత్‌చంద్రుని బెంగాలీ నవలకు చక్రపాణి తెలుగు అనువాదం ఆధారం కావటం విశేషం.
జూన్ 26, 1953లోవినోదా బ్యానర్‌పై విడుదలైన ఈ విషాదాంత కథను తెలుగు ప్రేక్షకులు ఆదరించక పోవచ్చుననే అనుమానం తల ఎత్తటంతో డి.ఎల్.నారాయణ ఒక్కరే ఈ చిత్ర నిర్మాతగా మిగిలిపోయారు. పార్వతి పాత్రకు షావుకారు జానకితో ఒక వారం షూటింగ్ అయిన తరువాత సావిత్రిని ఎంపిక చేసారు. ఈస్ట్రన్ ఫిలిం సిండికేట్ బ్యానర్‌పై 1929లో నరేష్ చంద్ర మిత్రా మూకీ చిత్రంగా, 1935లో ప్రనుతేష్ చంద్రబారువా బెంగాలీ టాకీ సినిమాగా తీసిన తరువాత తెలుగు, తమిళం భాషలలో వచ్చిన దేవదాసు క్రమేపీ భారతీయ భాషలలో కాకుండా 2010లో పాకిస్థాన్, 2013లో బంగ్లాదేశీ చిత్రంగారి సుప్రసిద్ధమైంది. బ్రిటీష్ పాలనా కాలంనాటి జమీందారీ, మధ్యతరగతి సంపన్న కుటుంబ చారిత్రక నేపథ్యం ఇతివృత్తంగా శరత్‌చంద్రుని ఈ నవలవ నాటి సమాజ స్వరూపాన్ని, గ్రామీణ, నగర జీవన వైవిధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. రావులపల్లి పల్లె ఆత్మీయ విశ్వాసాల బాంధవ్యం, నాటి మద్రాస్ వంటి నగరాల నాగరికతా వైభోగం కథను నడిపిస్తుంది. 50 రోజుల రాత్రివేళ షూటింగ్‌లు నిద్రలేమి కారణంగా వాటంతట అవే కుంగిపోతున్న కళ్ళు, ఆఖరి ప్రయాణంలో కళ్ళల్లో ప్రాణాలతో, ఎ.ఎన్.ఆర్. దుర్గాపురంలో మరణశయ్య దృశ్యం ప్రేక్షకులు ఎన్ని ఏళ్ళయినా మరిచిపోలేరు. ఎ.ఎన్.ఆర్. దేవదాసు పాత్రను తీర్చిదిద్దిన మేకప్ చీఫ్ మంగయ్యను తరువాత ఒక సందర్భంలో కృతజ్ఞతా పూర్వకంగా ప్రశంసించటం, ఆ మహానటుని ఔదార్యానికి తార్కాణం. వేదాంతం రాఘవయ్య, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, సముద్రాల రాఘవాచార్యులు, బి.ఎస్.రంగా, పి.వి.నారాయణ, సి.ఆర్.సుబ్బరామన్ వివిధ రంగాలకు సంబంధించిన టీమ్ అందరూ అద్భుత మేధావులే.
దేవదాసు చిత్రానికి సంగీతం, గానం ప్రాణం పోసాయి. అమర గాయకుడు ఘంటసాల ‘పల్లెకు పోదాం పారుని చూద్దాం’, ‘కుడి ఎడమ అయితే’ ‘కలా ఇది నిజమా’ రావు బాలసరస్వతి‘తానే మారెనా’, ‘అందాల ఆనందం ఇంతేనయ్యా’, కె.రాణి, ‘అంతా భ్రాంతియేనా’ డ్యూయట్‌లు ‘ఓ దేవదా...’, ’చెలియలేదు చెలిమి లేదు’ ప్రేక్షకుల హృదయాలను తన్మయింప చేస్తున్నాయి. సి.ఆర్.సుబ్బరామన్ ఆకస్మిక మరణం కారణంగా ఎమ్.ఎస్.విశ్వనాథన్ ‘‘జగమేమాయ’’, ‘‘అందం చూడవయా’’ పాటలకు వయొలినిస్ట్ టి.కె.రామమూర్తితో కలిసి అద్భుతంగా నేపథ్య సంగీతానికి ప్రాణం పోసారు.
దేవదాసు నిమాలో, నాగరికత మనకు వారసత్వంగా సంక్రమింపచేసిన మద్యం, సిగరెట్ హీరోను లొంగదీసుకోవటం, ముగింపు ఆ విధంగా ట్రాజెడీ కావటం ఒక విశేషం. నాడూ నేడూ యువతరాన్ని, కాలం మారినా ఫ్యాషన్‌గా క్రమేపీ అలవాటు, అనంతరం వ్యసనంగా జీవితాలలో చిచ్చుపెట్టే ఈ వ్యసనం నవల చదవటం అయితే అంత ప్రభావం చూపించకపోయినా, సినిమాగా జీవన వైఫల్యం వేదనాయుత మార్గం పట్టించి వుండవచ్చు. ఏది ఏమైనా యువతరానికి సంబంధించిన ప్రేమ, ఎడబాటు, బలీయమైన వాంఛల ఆశా నిరాశా నిస్పృహలు అత్యంత ప్రతిభావంతంగా ప్రేక్షకుల హృదయాలలో హత్తుకొనే నాటి సినిమా దేవదాసుకు ఎన్ని ఏళ్ళు గడిచినా..

-జయసూర్య 94406 64610