Others

పెద్దల మాటే వేదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతగా వెల్లివిరుస్తున్నప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్దల మాటే శిరోధార్యమని నేటి యువతలో అధికశాతం మంది భావిస్తున్నారు. తాజాగా జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అరవై శాతం మంది యువజంటలు పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాలు అన్ని విధాలా మంచివంటున్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఓ మేట్రిమోనియల్ సంస్థ సర్వే సందర్భంగా 600 మంది జంటలను ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైంది. పెద్దలు కుదిర్చిన సంబంధాలతో 69 శాతం మంది దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టగా, 31 శాతం మంది ప్రేమవివాహాలు చేసుకున్నారు. ఇప్పటికీ కుటుంబ పెద్దల మాటే పెళ్లి విషయంలో చెల్లుబాటవుతోందని, యువతీ యువకులు కూడా సంప్రదాయాల పట్ల మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది.
అయితే, ఆధునిక కాలంలో కులాంతర, మతాంతర, ప్రేమ వివాహాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. పిల్లల మనోభావాలను గుర్తిస్తూ తల్లిదండ్రులు కూడా ప్రేమ వివాహాలకు అనుమతిస్తూ తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నారు.
తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందన్న భావం ఇప్పటితరంలో క్రమంగా బలపడుతోందని సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రేమ వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, పెద్దల అభీష్టం మేరకు పెళ్లిళ్లు చేసుకునేందుకే అధికశాతం యువతీ యువకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. *