Others

పెళ్లిచేసుకోను.. కానీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏంటి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా.. నిజమే ఈ హీరోయిన్ పెళ్లి చేసుకోదట.. కానీ తన జీవితంలో ఓ ప్రత్యేక వ్యక్తి ఉన్నాడట. ఇలాంటి కామెంట్స్ చేసింది ఎవరో కాదు కోలీవుడ్ గ్లామర్ భామ లక్ష్మీ మీనన్. చిన్న వయసులోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి.. ఆ సినిమాలతోనే తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ తాజాగా ఓ సందర్భంగా మాట్లాడుతూ- వివాహ బంధంపై తనకు నమ్మకం లేదని పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టం చేసింది. అయితే తాను పెళ్లి చేసుకోనని.. అలాగని తన జీవితంలో ఎవరు లేరని అనుకోవద్దని, తన జీవితంలో ఖచ్చితంగా ఉంటాడని అతనికి చాలా ప్రేమ, నమ్మకం ఉండాలని చెప్పింది. అయితే దాన్ని సహజీవనం అని కూడా చెప్పలేనని చెప్పింది. ఇప్పటికే లక్ష్మీ మీనన్ ఘాటు ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ విషయంలో ఈ అమ్మడు ఇలా రెస్పాండ్ అవడం విశేషం.