Others

‘హలోగురూ... ప్రేమకోసమేనోయ్ జీవితం...’ (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1990ల్లో వచ్చిన ‘నిర్ణయం’ సినిమాలోని ‘హలో గురూ’ పాట నేటికీ సతతహరితమే. నేను, మా ఫ్రెండ్ ఆనంద్ ఫస్ట్ షోకు కావలిలోని ‘లత’ థియేటర్‌లో చూసిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది. డిగ్రీ మొదటి సంవత్సరం, అప్పుడే మొగ్గ తొడుగుతున్న యవ్వనం, కాలేజీ వాతావరణం ఈ సినిమాకన్నా ఈ పాటను మరపురానివి చేశాయి. ఒక్క రాత్రిలో ఈ పాటల క్యాసెట్ కొనుక్కొనో, బాడుగకు తీసుకొనో పాటంతా వ్రాసి, ఆ పేపర్‌ను క్లాస్‌రూమ్ బెంచ్‌మీద అంటించడం ఇంకా గుర్తే. అది చూసిన ఓ అమ్మాయి నవ్వుకోవడం, ఆ పేరడీని పాడటం ఆటోగ్రాఫ్‌లాంటిది. గణేష్‌పాత్రో వ్రాసిన పాటకు ఇళయరాజా కట్టిన బాణీ సరళము, సుందరము. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మురళీమోహన్ నిర్మాతగా వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు మలయాళీ ప్రియదర్శన్, అప్పట్లో సినిమా అర్థం కాలేదు సరిగా. కానీ పాటలు మాత్రం ఇప్పటికీ స్వీట్ మెమొరీస్‌వే. పాటలోని ప్రతి లైన్‌నూ తిరగవ్రాసి అప్పట్లోనే ‘పేరడీ పాటలు’ వ్రాయడానికి నాకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిన సినిమా ఇది. నాగార్జున, అమలలు నిజజీవితంలో ఒక్కటయ్యేందుకు కారణమైన ఈ సినిమా నా జీవితంలో నా ఫ్రెండ్ దూరమయ్యేందుకు కారణమైంది. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలీదుగానీ, ఈ పాట విన్నప్పుడల్లా, చూసినప్పుడు కళ్ళకు కట్టినట్లు సైకిల్స్‌పై సినిమాకెళ్ళడం అన్నీ కనిపిస్తుంటాయి. సిల్వర్‌జూబ్లీ సంవత్సరం అనుకోవచ్చు కాస్త అటు, ఇటుగా. నెట్‌లో చూస్తుంటాను నెలకోసారైనా. అప్పట్లో వయసు చాలక చేసిన చిలిపి పనులు చిలికి చిలికి గాలివానై నా లైఫ్‌లో అల్లకల్లోలం సృష్టించింది.
-కాళిదాసు విజయచంద్ర, కావలి