Others

400 కోట్లతో సంఘమిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి స్ఫూర్తితో సౌత్‌లో భారీబడ్జెట్‌తో పలు చిత్రాలను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ముందుగా చెప్పుకునేది.. సంఘమిత్ర సుందర్.సి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో మొదలైన ఈ సినిమాలో శృతిహాసన్ టైటిల్ రోల్‌లో నటించేందుకు ఓకె చెప్పడంతో షూటింగ్ మొదలుపెట్టారు. అయితే అనుకోకుండా శృతి తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం ఈ టైటిల్ రోల్‌లో బాలీవుడ్ భామ దిశాపటాని నటిస్తోంది. ఆర్య, జయం రవి హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.. కానీ ఇప్పుడది 400 కోట్లకు చేరింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాదిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.