Others

దటీజ్..రాశీఖన్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ రాశీఖన్నా పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. చేసే ప్రతి చిత్రంలో తన పాత్ర పరిధి ఎలాంటిదో ముందుగానే కసరత్తు చేసి, ఆ పాత్రలో జీవించడానికి తెగ తాపత్రయపడుతోంది. ఫలితంగానే నేడు టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే తను ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో అన్నీ గ్లామర్‌తో కూడుకున్న పాత్రలే కావడంతో అందరూ ఆమెను గ్లామర్‌గాళ్‌గానే పిలుస్తున్నారు. రాశీఖన్నా వైవిధ్యమైన పాత్రలవైపునకు కనె్నత్తి కూడా చూడటం లేదని పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయం గురించి ఖన్నాను కదిలిస్తే- ‘‘గ్లామర్ పాత్రలకే పరిమితం కాదలుచుకోలేదు. నాకు మాత్రం అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. వస్తున్న అవకాశాల్లో మంచివి అనుకున్నవి మాత్రమే ఒప్పుకుంటున్నా. అయితే అవి అన్నీ గ్లామర్‌తో కూడుకున్నవి కావటం చేత నాకు అలాంటి ఇమేజ్ వచ్చిందనుకుంటున్నా. నచ్చిన పాత్ర చేసేటప్పుడు ఆ పాత్రలో లీనమవడం నేను చేసేది. అయితే అది గ్లామర్‌తో కూడుకున్నదా? లేక వైవిధ్యమైన క్యారెక్టరా? అని ఆలోచించడం లేదు. ఇక నా పాత్రల విషయంలో మరింత జాగ్రత్త పడతా’’నంటూ చెప్పుకొచ్చింది ఎంతో తెలివిగా. దటీజ్..రాశీఖన్నా!

చిత్రం..రాశీఖన్నా