AADIVAVRAM - Others

సూట్‌కేసు మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడికైనా ప్రయాణానికి వెళుతున్నామంటే చాలు.. బోలెడంత లగేజీ.. వెళ్ళే హడావుడిలో వాటిని మోయాలంటే విసుగు, కోపం.. ఇప్పుడంటే ట్రాలీ సూట్‌కేసులు వచ్చేశాయి. వీటి పుణ్యమాని లగేజీని మోసే బాధ్యత తగ్గింది. ఎక్కడికి వెళ్లినా వీటిని లాక్కుంటూ వెళ్లచ్చు. ఫలితంగా బరువులు మోసే బాధతప్పి ప్రయాణం హాయిగా, ఆనందంగా మారింది. ఇలా లాగే పనికూడా లేకుండా మనం ఎటువెళితే, అటు నడిచే సూట్‌కేసు ఉంటే ప్రయాణం మరింత ఉత్సాహంగా, ఆనందంగా, భలేగా ఉంటుంది కదూ! మరి అలాంటిదే హ్యాండ్ ఫ్రీ రొబోటిక్ సూట్‌కేస్.. త్వరలో మార్కెట్లోకి విడుదలకానున్న ఈ సూట్‌కేస్ గురించి తెలుసుకుందాం..
హ్యాండ్ ఫ్రీ రొబోటిక్ సూట్‌కేస్ సెన్సార్లతో పనిచేస్తూ గంటకు 10.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మొబైల్ ఫోన్ సాయంతో పనిచేసే ఈ సూట్‌కేస్ వినియోగదారుడు ఎటువెళితే ఇదీ అటే ప్రయాణిస్తుంది. ఈ సూట్‌కేస్‌కు జీపీఎస్ వ్యవస్థను అనుసంధానించడం వల్ల దీన్ని దొంగలు ఎత్తుకెళ్లినా, కనిపించకుండా పోయినా ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఈ సూట్‌కేస్ ద్వారా మొబైల్‌ను కూడా చార్జ్ చేయవచ్చు. త్వరలో భారతదేశ మార్కెట్లోకి విడుదల కానున్న దీని ధర 26 వేల వరకు ఉండచ్చని అంచనా.. ఇలాంటి ఫ్రీ రొబోటిక్ సూట్‌కేస్‌లతో దొంగతనాల బెడద లేకుండా, లగేజీ మోయాల్సిన పనిలేకుండా ప్రయాణం మరింత మజాగా ఉంటుంది కదూ.