Others

బాలింతలకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది బాలింతల ప్రాణాలను కాపాడే సామర్థ్యమున్న అత్యద్భుత ఔషధాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) తెలిపింది. ‘హీట్ స్టేబుల్ కార్మెటోసిన్’గా వ్యవహిస్తున్న ఈ ఔషధం తీవ్రమైన ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటుందనీ, వెయ్యి రోజుల వరకూ నిలువ ఉంటుందనీ డబ్ల్యూహెచ్ ఓ వెల్లడించింది. సరైన శీతలీకరణ వసతలు లేని ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలకు ఇదో శుభవార్త అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసవానంతరం రక్తస్రావం కారణంగా సంభవిస్తున్న లక్షల మరణాలను నివారించేందుకు ఈ మందు సాయపడుతుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రసవానంతర మరణాల నివారణకు ఉపయోగపడే మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి అత్యధిక ఉష్ణోగ్రత, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. దానితో మరణాల నివారణ ఆశించిన స్థాయిలో సాధ్యం కావడం లేదు.
ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70,000 మంది మహిళలు ప్రసవానంతరం అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలను కోల్పోతున్నారు. ఆ ప్రభావం నెలలోపు పిల్లల మరణాలు పెరగడానికి కూడా కారణమవుతోంది. ఇన్నాళ్లుగా రక్తస్రావం వల్ల సంభవించే మరణాలను నివారణకోసం సాధారణ ప్రసవం జరిగిన వెంటనే ప్రతి తల్లికీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తూ వచ్చింది. అయితే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌ను రెండు డిగ్రీల నుండి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది. బాలింతకు ఇచ్చేటప్పుడు కూడా ఆక్సిటోసిన్ ఇదే ఉష్ణోగ్రత మధ్య ఉండాలి. కానీ సరైన శీతలీకరణ వసతులు, విద్యుత్ సదుపాయం సరిగా లేని దేశాల్లో అది సాధ్యం కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అంటున్నారు. బాలింతలకు ఇచ్చే ఇంజక్షన్‌లో పరీక్షలు నిర్వహించినప్పుడు పది దేశాల్లో దాదాపు 30,000 మంది బాలింతల్లో కొంతమంది ‘హీట్ స్టేబుల్ కార్మెటోసిన్’, మరికొందరికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్‌లను ఇచ్చారు. ఈ రెండు ఔషధాల ఫలితాలూ ఒకేలా వచ్చాయని పరిశోధకులు గుర్తించారు. అయితే నిలువ ఉండే వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే ఆ ఔషధాల మధ్య తేడా ఉందని ఆ నిపుణులు గుర్తించారు. అందుకే హీట్ స్టేబుల్ కార్మెటోసిన్ మందు దాదాపు 90 దేశాలకు చాలా ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన శీతలీకరణ వసతులు లేని ప్రాంతాల్లోని లక్షలాది మంది మహిళలకు ఇదో శుభవార్త అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడైన డాక్టర్ మెటిన్ గుల్మెజోగ్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇంకా పరీక్షలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని దేశాల్లో ఈ మందును అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ నిపుణులు చెప్పారు.
*