Others

క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజు హుషారుగా ఉండే రవళి ఈరోజెందుకో డల్‌గా కనిపించింది రవళి తల్లికి.
‘తల్లీ రవళీ ఎందుకిలా డల్‌గా ఉన్నావు’ రవళితల్లి అంజని
‘ఏం లేదమ్మా! ’ ఏదో చెప్పబోయి ఆగిపోయింది రవళి
‘లేదు అంటూనే సంకోచంగా ఉన్నావు. నీ మనసులో విషయం నాకు చెప్తే నీకు కావాల్సిన సమాధానం దొరుకుతుందేమో కదా’అంజని
‘నాకే తెలియడం లేదు. నువ్వు ఏం చెప్తావు ’ రవళి
‘విషయం చెప్పు తర్వాత సమాధానం గురించి ఆలోచిద్దాం ’అంజని
‘ ఉ...’
కాస్త తటపటాయించి ఇలా చెప్పుకొచ్చింది రవళి.
మా టీచర్ గారు ఇలా చెప్పారు. మనం చేసే పనులన్నింటిని భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడు. కనుక అందరూ మంచి పనులే చేయాలి. ఎప్పుడైనా తెలియక తప్పు చేస్తే భగవంతుడికి క్షమాపణ చెప్పుకుని పశ్చాత్తాప పడి మరలా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది అపుడు ఇక దేవుడు మనలను క్షమించి చెడు ఫలితం ఇవ్వకుండా ఉంటాడు అని చెప్పింది.
కాని నేను రెండు రోజుల క్రితం స్కూల్ కి వెళ్లేదారిలో ఓ ముసలి అతను ఆకలి అవుతోంది అన్నం కావాలి అని అడుగుతుండడం చూశాను. కాని నా దగ్గర అపుడు లంచ్ బాక్స్ లేదు. నేను ఏం చేయాలో తోచక అలానే వెళ్లిపోయాను. కాని అప్పట్నుంచి అతనికి అన్నం దొరికిందో లేదో అని బాధగా ఉంది. ఒకరు బాధపడుతుంటే చూస్తూ వెళ్లిపోవడం కూడా తప్పేకదా. మరి భగవంతుడు నన్ను శిక్షిస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేను భగవంతుడికి ఉత్తరం రాశాను. కాని పోస్టు చేయాలంటే అడ్రసు కావాలి కదా. అడ్రసు కనుక్కోవడం ఎలాగు అని ఆలోచిస్తున్నాను. మా ఫ్రెండ్స్‌ను అడిగాను. వారు మాకు తెలియదు అన్నారు .’ అని కన్నీరు తుడుచుకుంటూ రవళి చెప్పింది.
అంతా విని చిరునవ్వు నవ్విన అంజని
‘చూడు అమ్మా! నువ్వు చేసింది ఒక విధంగా తప్పుకాదు. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అంటారు కదా. నువ్వు స్కూల్‌కు వెళ్లిపోవడం ఏమంత తప్పుకాదు. కాని ఆ ముసలాయన ఫలాన చోటుకు వెళ్లు అక్కడ భోజనం దొరుకుతుంది అని చెప్పి వెళ్లి ఉండవచ్చు. అట్లా నువ్వు చెప్పి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు.
మనం చేతనైతే సాయం చేయాలి. ఒకవేళ మనం చేయలేకపోతే ఎక్కడ సాయం చేసేవాళ్లు ఉంటారో వారి గురించిన సమాచారం సాయం కావాల్సిన వారికి అందచేయాలి. అది సాయం చేసినట్లు అవుతుంది.
ఇక భగవంతుడి చిరునామా తెలియడం ఎట్లా అని కదా అనుకొంటున్నావు.
భగవంతుడు ఫలాన చోట అని ఉండడు. ప్రతి అంశంలోను ఉంటాడు. ప్రతివారిలోను ఉంటాడు. నీలో, నాలో, చివరకు చీమలో కూడా భగవంతుడు చైతన్యరూపంలో ఉంటూ ఉంటాడు. కనుక మనం చేతనైనంత సాయం అవసరమైన వారికి చేయాలి. అపుడు భగవంతుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా భగవంతుని కన్ను గప్పి చేయలేము. ఎందుకంటే అంతటా ఉన్న భగవంతుడిని ఫలాన చోట లేడు అని చెప్పలేము కదా. కనుక చేతనైనంత మంచి చేస్తే చాలు అదే భగవంతుని సేవ దానినే ఆయన మెచ్చుతాడు అంది అంజని.
అంతా విన్న రవళి మనసు కాస్త కుదుట పడింది.
‘అయితే ఈ సారి నేను సాయం చేయలేని స్థితిలో ఉంటే సాయం చేసేవారి గురించి అవసరమైనవారికి చెప్తాను’ రవళి
‘గుడ్ ఇపుడు భగవంతుడు నిన్ను తప్పక క్షమిస్తాడు ’అంది అంజని.

-మానస