AADIVAVRAM - Others

అన్ని రకాల జంతువులు నిలబడి నిద్రపోతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రాలు, మరికొన్ని జంతువులు నిలబడే నిద్రపోతాయి. వాటి కాల్లు యాంత్రికంగా అలా ఒక ఆకృతిలో నిలబడి ఉంటాయి. వాటి కండరాల బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. నిలబడిన ప్రదేశంలో స్థిరంగా ఉండడానికి వీటికి మోకాళ్లు అవసరం. పెద్ద జంతువులు నిలబడి నిద్రపోవడమే మంచిది. పడుకుని ఉంటే శత్రు జంతువులు దాడి చేసినప్పుడు వెంటనే నిలబడి పరుగెత్తడానికి అవకాశముండదు. బరువు తక్కువ ఉండే చిన్న జంతువులైతే చటుక్కున లేచి నిలబడి పరుగు తీస్తాయి. గుర్రాలు, జీబ్రాలు, ఏనుగులు నిలబడే నిద్రపోతాయి. ఆవులు కూడా నిలబడి నిద్రపోగలవు కానీ కాళ్లు మడిచి నేల మీద పడుకోవడానికి ఇష్టపడతాయి. కొన్ని పక్షులు కూడా నిలబడే నిద్రపోతాయి. ఫ్లెమింగో పక్షులు కాస్టిక్ సాల్ట్ ప్లాట్లు ఉండే ప్రాంతంలో నివసిస్తాయి. కూర్చుని నిద్రపోయే అవకాశం వాటికి ఉండదు. అనేక పక్షులు రాత్రిపూట చెట్ల కొమ్మల మీద ఒక కాలు మీద నిలబడి, మరో కాలు వేళ్లను మరో కొమ్మకు బిగించి నిద్రపోతాయి.

-నాయక్