Others

నవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వు...
మన అంతరంగంలో ఉరకలు వేసే
ఆనందానికి ప్రతిబింబం!
పెదాలనే వేదికగా మలుచుకుని
అందంగా నర్తిస్తూ
అందరినీ అలరించేందుకు
తళుక్కున మెరిసే ఓ కాంతి పుంజం !
హృదయంలోని
మధురానుభూతులను కలబోసుకుని
కనువిందు చేయ..
వదనమనే పూదోటలో విరబూసే
ఓ సుందర సుమం !
వెనె్నల వోలె
వెలుగులు విరజిమ్ముతూ..
ముఖానికి నిండు శోభను కూర్చే
ఓ అపురూప ఆభరణం!
కల్మశం అసలే ఎరుగని
పసిపిల్లల మోమును ఇష్టపడుతూ
అక్కడే కొలువుదీరుతుంది
ఎంచక్క
సంతోషాల రెక్కలు కట్టుకుని
ఎదుటివారి మనసులను
ఇట్టే ఆకట్టుకుంటుంది