Others

కీలుగుఱ్ఱం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1947 ప్రాంతంలో విడుదలై అన్ని థియేటర్‌లలో శత దినోత్సవం జరుపుకొని రజతోత్సవం వైపు పరుగులిడిన జానపద చిత్ర రాజం ‘కీలుగుఱ్ఱం’. సాధారణంగా శృంగార కథానాయికగా సాత్విక అభినయంతో మెప్పించే అంజలీదేవి ఇందులో రాక్షసిగా కనబడడం ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోయారు. నాగేశ్వరరావు కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో మహారాజుగా ఏ.వి.సుబ్బారావు వేశారు. అప్పట్లో స్టేజీ నాటకాలలో కృష్ణుడుగా వేస్తూ వచ్చిన ‘కనకం’ ఇందులో చిన్న రాక్షసిగా నటించింది. రాత్రికాగానే ఈ ఇరువురూ అశ్వశాల, గజశాలలో ప్రవేశించి గుఱ్ఱాలను, ఏనుగులను చంపి తినేవారు. ఎవరికి అర్ధంకాని విషయం. రాత్రికిరాత్రే తెల్లారేసరికి జంతువులు మాయమవడం ఎవరికి ఏమీ తోచడం లేదు. దీన్ని కనుక్కోవడానికి నాగేశ్వరరావు ఒక కీలుగుఱ్ఱంపై అశ్వశాల, గజశాలపై తిరుగుతూ ఏం జరుగుతుందో గమనించేవాడు. ఈ విషయం పసిగట్టిన రాజు ఇతన్ని వదిలించుకోవడానికి లేని తీవ్ర తలనొప్పి నటించి తన అక్క దగ్గరకువెళ్లి ఎవరైనా మందులేస్తే గాని ఈ తలనొప్పి తగ్గదని చెబుతుంది. ఒక ఉత్తరం రాస్తుంది ఆ పెద్ద రాక్షసికి. దానిలో సారాంశం ఏమిటంటే ఈ ఉత్తరం తెచ్చినవాడిని చంపెయ్యమని.
దారిలో యాధృచ్చికంగా ఆ ఉత్తరం చదివిన కథానాయిక దానిని కొద్దిగా మార్చి ‘ఇతనికి సత్కారం చేసి పంపు’ అని మారుస్తుంది. రాక్షసి అయిన తన మంత్రశక్తులలో అపురూప సౌందర్యవతిగామారి రాజును వలలోవేసుకొని పెద్ద రాణిని తొలగించుకొనే ప్రయత్నం చేస్తుంది. అతని లోనికి తీసుకువెళ్లిన భటులు ఆమెను చూపకుండా ఆనవాలుగా ఆమె కళ్లు తెర్చి దొంగరాణికి చూపిస్తారు.
పీడా వదలిపోయిందని ఆనందిస్తుంది రాక్షసరాణి. ఆకాశమార్గంలో కీలుగుఱ్ఱంపై ప్రయాణంచేస్తూ ఉండగా ఒక దొంగ సన్యాసి ఒక అమ్మాయిని అమ్మవారికి బలిఇవ్వబోతూ ఉండడం గమనిస్తాడు కథానాయకుడు. కిందికి దిగి వాణ్ణి చంపి ఆ యువతి ప్రేమను సంపాదించి ఆ అమ్మాయిని వివాహం చేసుకొంటానని వాగ్దానం చేస్తాడు. ఎంత దయామతివీ భవానీ, ఎంత కృపావతివే భవానీ, ఏదో పనికై ఏగేవానికి ఈ కన్యనిచ్చి అని పాడే పాట ప్రేక్షకులను అలరించింది. జానపద చిత్ర అభిమానులకు (నాలాంటి) కనువిందు కలిగించే మహత్తర వినోదాత్మక చిత్రం ఇది. ఇది మూడుగంటలన్నరా సాగే నిడివైన చిత్రం. అప్పటి చిత్రాలన్నీ ఇలాంటివి.

- కాకుటూరి సుబ్రహ్మణ్యం