Others

ఒత్తిడిని చిత్తు చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చికూరలు సలాడ్ లాగా పొద్దునే్న తీసుకోవడం వల్ల గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. పెరటి తోటను పెంచటం దాని బాగోగులను చూడడం లాంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిద్రలేమి వల్ల చిన్న ఇబ్బందైనా పెద్దదిగా కనిపిస్తుంది. బాగా నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడి చిత్తు చేయవచ్చు. తులసీతో చేసిన టీ తాగడం వల్ల కూడా హార్మోన్ సమస్థితి కి వచ్చి ఒత్తిడిని తట్టుకోవచ్చు. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను అనే్వషించాలి కాని జీవన గమ్యాన్ని సంక్లిష్టపరుచుకోకూడదు.

చిన్న పెద్దా తేడా లేదు. అందరికీ అన్ని వేళలా ఒత్తిడి మాత్రం ఉంటోంది. స్కూల్ కు వెళ్లే పిల్లల దగ్గర నుంచి ఆఫీసుల్లో ఆరెంకల జీతం తీసుకొనేవారి దాకా ఏదో ఒక ఒత్తిడి భరించేవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య ఒత్తిడికి తట్టుకోలేక కూర్చున్నవారు కూర్చున్నట్టుగాను, నిలబడ్డవారు నిలబడినట్టుగాను ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎందుకిలా అంటే పని కాలేదనో, అనుకొన్న పని కాక రావాల్సిన డబ్బులు రాలేదనో, ఏ పనీ దొరకలేదనో, అప్పులు ఎక్కువవైయ్యానో, లేక చదువురావడంలేదనో, తల్లిదండ్రులు మందలించారనో ఇలా ఎన్నో సాకులు ఇవన్నీ ఒత్తిడి ని భరించలేక ఇలా చేస్తున్నారన్నది మాత్రం వైద్యుల అభిప్రాయం.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగాలు,ఎక్సైరైజులు లాంటివి పనికి వస్తాయి.
అవేకాదు నలుగురితో కలసిమెలసి స్నేహం చేయడం వల్ల నలుగురిలో మంచివారితో అన్నీ సమస్యలను మాట్లాడుకోవడం వల్ల కూడా ఇతరుల సలహాలతో ఒత్తిడి ని అధిగమించవచ్చు. కాని మంచిస్నేహితులను మాత్రం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. లేకుంటే ఆ స్నేహితులే ఇబ్బందులను మరింత పెంచవచ్చు. అందుకే అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు. శారీరిక అనారోగ్యాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయ. కనుక చిన్న జబ్బు ఉన్నాసరే మంచి మందులు తీసుకొని అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలి.
దానితో పాటు పచ్చికూరలు సలాడ్ లాగా పొద్దునే్న తినడం వల్ల గ్రీన్ టీ తాగడం వల్ల కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. బొప్పాయి పండు తినడం వల్ల కూడా ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చు. పెరటి తోటను పెంచటం దాని బాగోగులను చూడడం లాంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. తులసీతో చేసిన టీ తాగడం వల్ల కూడా హార్మోన్ సమస్థితి కి వచ్చి ఒత్తిడిని తట్టుకోవచ్చు. క్యారెట్ టమాట జ్యూస్ పొద్దునే్న అంటే పరగడుపున తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గడమే కాదు ఒత్తిడిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది. ఎప్పుడు టీ తాగినా దానిలో కాస్తంత అల్లం ముక్కను చేర్చుకుంటే రుచేకాదు ఒత్తిడిని దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది. బాగా నిద్ర పోవడం వల్ల కూడా ఒత్తిడిని మానసిక శక్తితో అధిగమించవచ్చు. ఒక్కోసారి నిద్రలేమికలిగినప్పుడు చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపించి ఏమి చేయాలో అన్న ఆదుర్ధా కలుగుతుంది. అందుకే రాత్రిళ్లు నిద్ర బాగా పోవాలి. ఒక్కోసారి నిద్ర తక్కువ అనిపిస్తే వీలునుబట్టి మధ్యాహ్నం పూట అరగంట పడుకోవడం వల్ల కూడా శారీరికంగా కూడా శక్తి కలుగుతుంది. మెరుగైన ఆలోచన్లు వస్తాయ. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. ఒక్క ఆలోచన వంద మార్గాలను సూచిస్తుంది. కనుక ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలను అనే్వషించాలి కాని జీవన గమ్యాన్ని సంక్లిష్టపరుచుకోకూడదు.

- వాణి ప్రభాకరి