AADIVAVRAM - Others

పేదింటి పిల్లలు మెడికోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో సాదాసీదా చాయ్‌వాలాలు చరిత్ర సృష్టిస్తున్నారు.. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ చాయ్‌వాలాగా పనిచేసి, ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా, ఇంకెందరో ‘టీ’ అమ్ముకునే వ్యక్తులు పరోపకారంలోనే జీవిత పరమార్థం ఉందని తమకు చేతనైంతగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. ఒడిశాకు చెందిన అజయ్ బహదూర్ సింగ్ డాక్టర్‌గా పేదలకు సేవలందించాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. పేదరికం, కుటుంబ బాధ్యతలతో ఆ ఆశ నెరవేరకపోయినా అతను డీలా పడలేదు. ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌కు చెందిన అజయ్ కుటుంబం జీవనోపాధి నిమిత్తం భువనేశ్వర్‌కు 2005లో వలస వచ్చింది. ఉన్నత చదువులకు అవకాశం లేనందున టీ’ దుకాణం నడుపుతూనే పేద విద్యార్థులకు అజయ్ చేయూతనందిస్తున్నాడు. మెడిసిన్ ఎంట్రన్స్‌కు సన్నద్ధమయ్యే నిరుపేద విద్యార్థులకు అజయ్ కోచింగ్ ఇప్పిస్తున్నాడు. ఇతని ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకున్న వారిలో 18 మంది విద్యార్థులు ఈ ఏడాది మెడిసిన్ సీట్లకు ఎంపికయ్యారు.
ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా నడుస్తున్న ‘ఆద్యంత సైన్స్ కళాశాల’లో విద్యార్థులకు కోచింగ్ ఇప్పిస్తూ, వారికి అన్నివిధాలా అజయ్ అండగా ఉంటున్నాడు. ‘జిందగీ’ (జీవితం) పేరిట మెడిసిన్ కోచింగ్ ఇప్పిస్తున్న అజయ్ వల్ల ఇప్పటి వరకూ ఎందరో పేద విద్యార్థులు మెడికోలుగా మారారు. ‘ఆద్యంత కళాశాల’లో ఈ ఏడాది 600 మంది విద్యార్థులు కోచింగ్‌కు చేరగా, అందులో తెలివైన 20 మంది పేద విద్యార్థులను అజయ్ ఆర్థికంగా ఆదుకున్నాడు.
తొలుత 2010లో ముగ్గురు విద్యార్థులకు రెండేళ్లపాటు కోచింగ్ ఇప్పించగా వారు 2012లో మెడిసిన్ సీట్లు సాధించారు. దీంతో మరింతమంది విద్యార్థులకు కోచింగ్ ఇప్పించాలని భావించిన అజయ్ తన సంపాదనలో కొంత భాగాన్ని విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్నాడు. కోచింగ్ క్లాసులకు వెళ్లే పిల్లలకు పుస్తకాలు, ఆహారం, వసతి సౌకర్యాలను ఉచితంగా అందజేస్తున్నాడు. ఈ ఏడాది 20 మందికి కోచింగ్ ఇప్పించగా 18 మందికి వైద్య కళాశాలలో సీట్లు రావడంతో అజయ్ ఆనందానికి అవధుల్లేవు. గతంలో ఆనంద్‌కుమార్ అనే వ్యక్తి ‘సూపర్- 30’ పేరుతో విద్యాదానం చేస్తూ ప్రశంసలు పొందిన కథనాలను పత్రికల్లో చదివి తాను స్ఫూర్తిని పొందానని చెబుతున్నాడు. అజయ్ అండతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు మెడిసిన్ పూర్తి చేసి వైద్యులుగా సేవలు అందించబోతున్నారు. వీరి విజయగాథలు ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఆధ్యాత్మిక పట్టణమైన పూరిలోని జగన్నాథ ఆలయం వద్ద పూలమ్ముకునే ఓ చిరువ్యాపారి కుమార్తె ట్వింకిల్ ఈ ఏడాది మెడికల్ కాలేజీలో ప్రవేశానికి అర్హత పొందింది. పేదరికం కారణంగా తాను చదువుకు స్వస్తి చెబుదామనుకున్న తరుణంలో అజయ్ కోచింగ్ ఇప్పించడంతో మెడిసిన్ సీటు సాధించానని ట్వింకిల్ చెబుతోంది. పేద పిల్లలను పెద్ద మనసుతో ఆదుకుంటున్న చాయ్‌వాలా అజయ్- సమాజసేవలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉందంటున్నాడు. *