AADIVAVRAM - Others

ఆ ‘క్లిక్కే’ వేరబ్బా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరిగేకాలంలో చెదరని జ్ఞాపకాలకు ప్రతిబింబాలు ఫొటోలు. ఇప్పుడంటే కెమెరా, సెల్‌ఫోన్ రూపంలో చేతిలోనే ఉండటం వల్ల ప్రతి సందర్భాన్నీ జ్ఞాపకాలుగా మలచుకుంటున్నాం.. కానీ దశాబ్దం క్రితం వరకు ఫొటోల సంస్కృతి తక్కువే.. తీసుకున్న ఫొటోలు కొనే్న అయినా.. సమయం దొరికినప్పుడు వాటిని ముందేసుకుని ప్రతి ఫొటో వెనుక ఉన్న ఆ సందర్భాన్నీ.. కథనీ.. అనుభూతిని.. తలచుకుంటే భలే గమ్మత్తుగా ఉండేది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇస్తాయి ఫొటోలు.. ఈ డిజిటల్ యుగంలో ఫొటోగ్రఫీ పంథా మారిపోయింది. ఫొటోగ్రఫీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. నామకరణం నుంచి షష్ఠిపూర్తి వరకు.. సందర్భం ఏదైనా సరే.. ముందు ఫొటోలు ఉండాల్సిందే.. మొదట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి. కాలక్రమేణా కలర్ ఫొటోగ్రఫీ ప్రాచుర్యంలోకి వచ్చింది. తరువాత డిజిటల్ ఫొటోగ్రఫీ.. ఇందులోనూ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, మ్యారేజ్ ఫొటోగ్రఫీ, స్టిల్ ఫొటోగ్రఫీ.. ఇలా ఎన్నో.. ఏది ఏమైనా నేటి ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతూ రోజురోజుకూ కొత్తదనాన్ని సంతరించుకుంటూ దూసుకుపోతోంది.. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైమరపించే కొన్ని ఫొటోలు మీ కోసం...