Others

హిట్ కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్‌తో చేసిన అ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్‌కు ఆ చిత్రం మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఆయన చేసిన లై, చిన్నదానా నీకోసం, చల్ మోహనరంగ సినిమాలు భారీ పరాజయాన్ని అందుకున్నాయి. దాంతో నితిన్ టెన్షన్‌లో పడ్డాడు. ప్రస్తుతం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శ్రీనివాసకళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తన తదుపరి సినిమా ఎవరితో అన్న ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే ఆయనతో సినిమాలు చేయడానికి పలువురు దర్శకులు వెయింటింగ్ లిస్టులో ఉన్నారు. అయితే తనకు మంచి సక్సెస్ ఇచ్చే దర్శకుడి కోసం నితిన్ అనే్వషణలో పడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. శ్రీనివాస కళ్యాణం
వచ్చే నెలలో విడుదల కానుంది. ఆ తరువాత చల్ దర్శకుడితో భీష్మ అనే సినిమా వుంటుందని
అంటున్నారు. దాంతోపాటు తాజాగా ఆర్‌ఎక్స్ 100తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అలాగే తనకు
ఇష్క్ లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మరి ఈ మూడు ప్రాజెక్టుల్లో ఏది సెట్ అవుతుందో చూడాలి.

శ్రీనివాస్ ఆర్.రావ్