Others

మనసు ఆహ్లాదంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిని గాని, ఒంటిని గాని పరిశుభ్రంగా చూసుకోకపోతే మనసు బాగుండదు. ఇల్లు బాగుండదు. అందుకే పూర్వం ఇల్లు ను చూసి ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగున్నట్టే..
కాని కొంతమంది ఉద్యోగాలు చేసేవారు, ఇంట్లో ఉండేవారు కూడా అనుకోండి ఇల్లు సర్దడానికి బద్దకిస్తుంటారు. ఇట్లా బద్దకిస్తే మనకే కాదు ఆ సమయంలో ఎవరైనా ఇంటికి వస్తే వారు కూడా కాస్త ఇబ్బంది పడుతారు. ఇల్లు సర్దడం అనేది పెద్ద పనిగా పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఇల్లు నీట్‌గా ఉండేలా చూసుకోవాలి. మోక్షగుండం విశే్వశ్వరయ్య గారు కూడా ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలి అనేవారట. అట్లానే బట్టలు పెట్టుకునే బీరువా ఉతికినవో లేక ఇస్ర్తి చేసినవో వేటి స్థానంలో వాటిని పెట్టేయాలి. వాడేసిన బట్టలు ఏరోజు కారోజు ఉతికి ఆరవేసుకోవాలి. లేదంటే వాటికోసం ప్రత్యేకంగా ఒక బుట్టను పెట్టుకోవాలి. అందులో వాడేసిన బట్టలు వేసుకోవాలి. దీనివల్ల దుర్గంధం వ్యాపించకుండా ఉంటుంది.
బీరువాలో పిల్లల దుస్తులు, పెద్దలు దుస్తులు విడివిడిగానే కాక లో దుస్తులు ఒకవైపు, ప్యాంట్లు ఒకవైపు, షర్ట్సు ఒక వైపు పొందికగా పెట్టుకోవాలి. వీరు ఇంట్లో ధరించే లుంగీలు, టవల్స్, ల్లాంటివి విడిగా పెట్టుకోవాలి. అట్లానే మహిళలకైతే ఇంట్లో వాడుకొనేవి, బయటకు వేసుకొనేవి రెండురకాలుంటాయి కదా. వాటిని కూడా లో దుస్తులు ఒకవైపు, చీరలు ఎపుడైనా కట్టుకొనేవి ఒకవైపు, రోజువారీ ఆఫీసులకు వెళ్లేటపుడో, లేక బజారుకు వెళ్లేటపుడు కట్టుకునేవి అంటూ విడివిడిగా అమర్చుకోవాలి. జాకెట్లు, లంగాలు కూడా ఏ చీరకాచీరలో కాని లేక విడిగా కాని చక్కగా వైపున పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకోవడమే కాదు తీసుకొన్నప్పుడు కూడా నీట్‌గా తీసుకోవడం తిరిగి వాటిల్లో పెట్టేపుడు కూడా జాగ్రత్తగా మడతలు వేసి పెట్టుకోవాలి. అపుడు బీరువాలు సర్దాలి అన్న బాధ ఉండదు. పిల్లలకు కూడా అదే పద్దతిని నేర్పించాలి.
అట్లానే పేపర్లు, బుక్స్ ల్లాంటివి వాటికొక ప్లేసును పెట్టి ప్రతిరోజు అక్కడే పెట్టేట్టు చూసుకోవాలి. పిల్లల క్లాసు పుస్తకాలకు ప్రత్యేకంకగా అమరికను చేయాలి. వారికి అందులోనే పుస్తకాలు పెట్టుకునేట్టుగా అలవాటు చేయాలి. ప్లవర్‌వాజ్‌ల్లో పూలు పెట్టేట్టయితే ప్రతిరోజు నీటిని మార్చాలి. ఏ రోజుకా పూలు ఒక నిర్ణీత సమయంలో పెట్టాలి.కొందరు సోఫాల్లో కుర్చీల్లో కూడా బట్టలు వేసేస్తుంటారు. ఈపద్ధతిని మార్చుకోవాలి. తడి బట్టలు బయట బాల్కనీలో వేయాలి. అని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పివ్వాలి. బెడ్ మీద టవల్స్ నిక్కర్లు, చీరలు ఇట్లాంటివి కూడా వేసేస్తుంటారు. అదొక బట్టల కొట్టులాగా ఉంటుంది. అట్లాకాక పొద్దునే్న లేవగానే దుప్పట్లు తీసేసి మడత వేసి వాటికి పెట్టిన స్థానంలో పెట్టాలి. మంచం మీద ఒక్క దిండుమాత్రమే పెట్టాలి. బెడ్‌షీట్ అందంగా పరచి ఉండాలి. ప్రతివారం వీటిని మార్చుకుంటూ ఉండాలి.
ముందురూమ్‌లోకాని లోపల గాని డస్ట్‌బిన్‌ను పెట్టుకోవాలి. చిన్న చిన్న కాగితాలు గాని, లేదా మందుల రేపర్లు చాక్లెట్ల కవర్స్ ల్లాంటివి చించి కింద పడయ్యకుండా ఆ డస్ట్‌బిన్‌లో వేసుకొనేలా చూడాలి. ప్రతిరోజు ఆ డస్ట్‌బిన్‌ను కూడా శుభ్రం చేయాలి. సగం తినేసి వదిలేసిన ప్లేటు ఎక్కడంటే అక్కడ వదిలేయక వాటిని సింక్‌లో పెట్టే అలవాటును చేసుకోవాలి. ప్రతిరోజు సర్వెంట్ మెయిడ్ వస్తే సరే లేకున్నా పొద్దున్నా సాయంత్రం ధూళి లేకుండా చేసుకోవాలి. వారానికి ఒకసారి అన్నీ సోఫాలు, మంచాలు, కిటికీలు, అలమరలు ల్లాంటివి దులిపి దుమ్మును దూరం చేసుకోవాలి. ఇట్లానే కిచన్‌లోకూడా కొన్ని పద్ధతులు పాటిస్తే చాలు ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది. మనసు కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చి ఆహా మీ ఇల్లు ఎంత బాగుందో చక్కగా సర్దుకున్నారు. మీ టేస్ట్ తెలుస్తోంది అన్నపుడు ఆ ఇంటి ఇల్లాలి ఆనందం అంతా ఇంతా కాదంటే ... నిజమే కదా... ఆ ఆనందం కొలవడానికి కొలతలు సరిపోవు .

- మాగంటి రాధిక