Others

నియంత్రణ తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపుడైనా నీ మనసుకు జవాబు చెప్పుకునేట్టు పనులు చేయకూడదు. శరీరం కూడా మన మాట వినాల్సిందే. కానీ ఆ శరీరం మాట మనం వినాల్సి వస్తే మనం పని చేయలేం. నాలుక కోరినట్టు రుచులను అందిస్తే అది తినేస్తూ పోతుంది. కడుపులో జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతిన్నా నాలుక పట్టించుకోదు. పొట్టకూడా కొవ్వురూపంలో నాలుక అందించిన ఆహారాన్ని రూపుమార్చుకుని నిల్వ చేస్తూ పోతుంది.
ఇక అప్పుడే మన శరీరం మాట మనం వినాల్సి వస్తుంది. అది లేవమంటే లేవదు.నడవమంటే నడవదు. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టేస్తుంది. చూసేవాళ్లు , చూడని వాళ్లు సైతం ఇట్లా ఉంటే మీకు హృద్రోగాలు వస్తాయని క్యాన్సర్ కూడా రావచ్చు అని భయపెట్టేస్తుంటారు.
అందుకే శరీరం మీ మాట వినాలి అంటే మాత్రం శరీర బరువును నియంత్రణలో ఉంచుకోండి.
ప్రతిరోజు ఎంత కష్టమనిపించినా సరే ఒక అరగంట నడవండి. బ్రిస్క్‌వాక్ లాంటిది కూడా కాసేపు చేయండి. చిన్నపాటి వ్యాయామాలు మీకిష్టమైతే అవీ చేయండి. అంటే దాదాపుగా గంట దాకా శరీరం గూర్చి ఆలోచించండి. అపుడు ఆ శరీరం మీ మాట వినడానికి చెవొగ్గుతుంది.
అంతేకాదండోయ్ నోటిని కూడా అదుపులో ఉంచుకోవాలి సుమా. చప్పటి తిండి తినమని కాదు. చక్కెర లేని టీ, కాఫీలు తాగమని కాదు మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రైట్స్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అదెలా అంటారా.. ఇదిగో ఆపిల్స్, బెర్రీలు లాంటి పండ్లు తీసుకోండి. అంతేకాదు పీచు పదార్థాలు అధికంగా తీసుకోండి. అంటే ఆకుకూరలు, పండ్లు,తృణధాన్యాలు, రోజూ తీసుకోండి. దీనివల్ల మీ జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది.పైగా మీ ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కూడా కరిగించడానికి తోడ్పాటునిస్తాయి. అంతేకాదు ఈ పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు ఊరికినే ఆకలి వేసినట్టు కూడా అనిపించదు. దానివల్ల మీరు టైముప్రకారం ఆహారాన్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు మీరు చేస్తున్న పని ఎంత? దానికి తగ్గ ఆహారాన్ని తీసుకొంటున్నారా లేదా కూడా చూడాల్సి వస్తుంది.
ఎందుకంటే తక్కువ కెలెరీస్ తీసుకొని ఎక్కువ కెలరీస్ కరిగేట్టుగా పని చేస్తూ పోయారనుకోండి. అది నీరసానికి దారి తీస్తుంది. ఇంకా వివిధ రకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. పంచదార వల్లకూడా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వంటల్లో పంచదారకు బదులు బెల్లం, తేనె లాంటివి వాడి చూడండి. తింటే లావు అవుతున్నామనుకొని ఆహారాన్ని తీసుకోకుండా ఉండకండి. పొద్దునే్న అల్పాహారం, మధ్యాహ్నం సంపూర్ణ ఆహారం, సాయంత్రం ఉపాహారం లాగా మీరు చేసే శ్రమను బట్టి ఆహారం తీసుకోండి. అది కూడా అర్ధరాత్రిళ్లు కాకుండా త్వరగా తీసుకోండి. తిన్న వెంటనే మంచం ఎక్కకండి. కాసేపు వాకింగ్ చేయండి. అపుడు తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఆ తరువాత మీరు హాయిగా నిద్రపొండి. ఎక్కువ ఆలోచన్లు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండండి. అపుడు మీ మనసే కాదు మీ శరీరమూ మీ మాట తప్పక వింటుంది.

-వాణి ప్రభాకరి