AADIVAVRAM - Others

కృష్ణ.. రాధ.. గోపాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రియ ఉత్పాదన మరియు సీమా పన్నుల (సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) వారి కార్యాలయం అది. రాధ, కృష్ణ, గోపాలం ముగ్గురూ ఒకే భాగంలో పని చేస్తారు. ముగ్గురికీ పెళ్లిళ్లు కాలేదు. ఇంచుమించు ఒకటే వయసు వారు.
ముందుగా రాధ గురించి. కవులు సాధారణంగా దొండపండు పెదవులు, తమలపాకు పెదవులు, సంపంగి రేకులాంటి ముక్కు అని వర్ణిస్తారు కానీ, ఇవేమీ అస్సలు సరిపోవు ఆమెను వర్ణించటానికి. సరే నా ప్రయత్నం నేను చేస్తాను మరి.
పిడుగులు పడే ముందు తళతళ అంటూ ముందు కాంతిపుంజపు రేఖ ఒకటి వస్తుంది. గమనించే ఉంటారు. అది ఆ శరీర వర్ఛస్సు తర్బూజా (వాటర్‌మెలన్) లోపలి, అంటే మధ్యలో (కోర్) ఉండే ఎరుపురంగు, అంచుల్లో దోసకాయ పసుపు రంగుతో వున్న పెదాలు, ఇహ నాశికాగ్రం, యేమి చెప్పమంటారు! బ్రహ్మగారు యే పదార్థంతో ఈ దేహాన్ని తయారుచేస్తారో మనకి తెలీదు కానీ, శరీరంలో వొంపులు రావటానికి కుమ్మరి మట్టి పాత్రలను చేసినట్లు, చేస్తుంటే, అకస్మాత్తుగా సరస్వతీ దేవి పిలిచి అటువైపు చూసి ఉంటారు. ఆ ఒక్క క్షణంలో ఈ ముక్కు రూపుదిద్దుకుంది అన్నమాట. భూమండలం మీద క్లియోపాత్రా ముక్కు ఒకానొకప్పుడు ప్రఖ్యాతి చెంది ఉండవచ్చు కానీ, మన రాధ ముక్కు చూశారంటే ఆ మాట ఎవ్వరూ ఒప్పుకోరు. ‘ఆ క్లియోపాత్రాదీ ఓ ముక్కేనా’ అనక మానరు.
నాలో వున్న బలహీనత ఇదే. రాధను వర్ణిస్తూ, అసలు కథను మర్చిపోతాను.
ఇహ మన కృష్ణ, గోపాలం - మగవారిని పెద్దగా వర్ణించటం ఎందుకు లెండి. పొడుగు బానే, ఒకరు కొంచెం సన్నం, ఒకరు పొడుగుకు తగ్గ లావు. ఒకరిది ఎప్పుడూ నవ్వే మొహం. ఒకరిది గంభీరం. ఎవరు ఎట్లా వుంటారు అన్నది మీరు నాకు చెప్పాలి. కథ చదివి ఊహించి.
పరిచయాలు అయినాయిగా.. ఆ రోజు కొంచెం తీరుబడిగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రతిరోజు తీరుబడే అనుకోండి. అది వేరే మాట.
రాధ తలవంచి పని చేసుకుంటోంది. వాళ్ల స్నేహితురాలికి గ్రీటింగ్ కార్డ్ డిజైన్ చేస్తోంది, ఎవరికీ చెప్పకండే.. సెక్షన్‌లో ఎవరూ లేరు. ఈ ముగ్గురు తప్ప.
కృష్ణ అన్నాడు, చాలా మెల్లగా ‘ఏదన్నా మార్గం చెప్పరా, ఎలా తెలుసుకోనూ, ఇష్టమో కాదో? ఇంకెన్ని రోజులు ఇలాగ’
‘కొంచెం వినబడేటట్లు అను. మన దేశపు ఆడవారు చీర కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. కుర్తాలు, పంజాబీ డ్రెస్సులు వేసుకుంటేకన్నా’ అని కాసే ఆగి’ రాధ ఓసారి కళ్లెత్తి చూసి మళ్లా తన పని చేసుకోసాగింది.
ఓ పది నిమిషాల తర్వాత, ఏదో మాట్లాడుతున్నట్టు కృష్ణ ఇదే మాట, కొంచెం గట్టిగా అన్నాడు.
మర్నాడు రాధ, ఇంచక్కా చీర కట్టుకుని వచ్చింది. ఇంతకు ముందు ఎన్నడూ లేనిది.
చూడంగానే, ఎగిరి గంతు వేయబోయి, ఆరో అంతస్తు కిటికీలోంచి కింద పడబోతుండగా అతికష్టం మీద పట్టుకుని ఆపగలిగాడు గోపాలం.
ఆ రోజు సాయంత్రం మందు పార్టీ ఇచ్చాడు, కృష్ణ గోపాలంకి. ‘ఎందుకూ, నిన్ను కిటికీలోంచి పడకుండా ఆపినందుకా’ అడిగాడు గోపాలం.
‘కాదు గురూ. చీర కట్టుకుని వచ్చిందిగా, అందుకు పచ్చ సిగ్నల్ వచ్చేసినట్లేగా. మెల్లిగా రేపు సాయంత్రం ముహూర్తం పెట్టేస్తా, డైరెక్ట్‌గా అడగటానికి’
‘తొందరపడమాకు. రేపు, నీలంరంగు కుర్తా, పసుపుపచ్చ పైజమా మీద బాగుంటుంది’ అని అను తర్వాత చూద్దాం’ అన్నాడు గోపాలం ఆలోచిస్తూ, మందు గుటక వేసి.
అలాగే జరిగింది. ఆ మర్నాడు రాధ అక్షరాలా అట్లాగే వచ్చింది.
సెక్షన్‌లో అందరికీ స్వీట్లు, హాట్లూ, కాఫీలు, టీలు తెప్పించాడు కృష్ణ. ‘ఏమిటీ విశేషం’ అని అడిగితే, లేని చెల్లెలికి పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పి.
ఆ సాయంత్రం, మళ్లా బారు అతను పండుగ చేసుకున్నాడు.
‘ఇహ కన్ఫర్మ్ అయిపోయింది గురూ. రేపు సాయంత్రం ముహూర్తం పెట్టేస్తున్నా...’
‘తొందర పడమాకు కృష్ణా.. ఇంకొక్కసారి. ఈసారి పసుపురంగు డ్రెస్ మీద ఎర్ర గులాబీ పువ్వు ఒకటి జడలో ఎంతో గొప్పగా ఉంటుంది అను. ఇది కూడా జరిగితే నిన్ను ఆపను’
జరిగింది, అలానే...
పైన కిటికీలోంచి చూసిన కృష్ణ. ఆపుకోలేక, ఆరో అంతస్తు నుంచి లిఫ్ట్ కోసం ఆగలేక, మెట్ల గుండా ఎదురువెళ్దాం అని దిగేటప్పటికీ, తను లిఫ్ట్‌లో పైకి వచ్చేసింది.
ఆ రోజు సాయంత్రం బార్ ఓనర్ పండగ ఒక్కటే కాదు, సందడి కూడా చేసుకున్నాడు. ఎందుకు ఏమిటీ? అక్కడ వున్న వారందరికీ పార్టీ మరి. కృష్ణ ఇచ్చాడు.
‘రేపు అడిగేస్తా. ఇహ నువ్వు ఇంకోటి ఏదో పెట్టకు. ఉత్త కబుర్లే అనుకుంటే మొదటికి మోసం వస్తుంది’
‘కరెక్టే. కానీ మెల్లిగా సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మీతో మాట్లాడాలి అను ఎవరూ లేనప్పుడు ఈ లోపల తొందరపడమాకు. పొద్దుటి నుంచి వెకిలి వేషాలు వెయ్యకు. జాగ్రత్తగా డీల్ చెయ్యి’ అన్నాడు గోపాలం. ఆ మరునాడు, మధ్యాహ్నం లంచ్ టైమ్‌కు ముందు గోపాలానికి కొరియరు అతను వచ్చి ఓ లెటర్ ఇచ్చి వెళ్లాడు.
అందులో గులాబీ రంగు కాగితం మీద, ముత్యాల లాంటి అక్షరాలు; సెంటు అద్దినట్లు కమ్మని సువాసన ఆ ఉత్తరంలో..
‘గోపాలంగారూ! చీర, నీలంరంగు, గులాబీ అన్నీ మీకు బాగా నచ్చుతాయి అని చెప్పారు. నాకూనూ. మరి, ఇహ, మీరేం అంటారు..?’
అని ఉంది. కింద సంతకం లేదు.
మరి మీరేం అంటారు!!
*

--నండూరి రామచంద్రరావు 99491 88444