Others

ప్రసవానికి సైకిల్‌పై వెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలీజెంటర్ న్యూజిలాండ్‌కు చెందిన రవాణాశాఖామంత్రి. మంత్రి కాబట్టి ఎక్కడికైనా కారులోనే వెళ్లగలదని వేరే చెప్పక్కరలేదు. కానీ ఈ మంత్రి నిండుగర్భిణి. పురిటి నొప్పులు మొదలుకాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిలోమీటరు దూరం ఉన్న సిటీ ఆసుపత్రికి సైకిల్‌పై బయలుదేరింది. ఆమె భర్త మరో సైకిల్‌పై ప్రయాణిస్తూ జూలీజెంటర్ ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది వైరలైంది. జూలీజెంటర్ కార్యాలయానికి మాత్రమే కారులో వెళుతుంది. మిగిలిన ఏ పనులకైనా సైకిల్‌నే వాడుతుంది. ఆమెకు సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. అదే తన ఆరోగ్య రహస్యమని నమ్ముతుంది ఆమె. గత నవంబర్‌లో తను నెల తప్పానని తెలిసినప్పుడు ‘నా సైకిల్‌కు మరో సీటు తగిలించే సమయం ఆసన్నమైంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఆదివారం రోజు ( ఆగస్ట్ 19)న ఆమెకు పురిటినొప్పులు మొదలుకాగానే ఆసుపత్రికి ఫోన్ చేసింది. వెంటనే డాక్టర్లు ఆమెను ఆసుపత్రికి రమ్మన్నారు. జూలీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లిపోయింది. జూలీ తన బిడ్డ కోసం మూడు నెలలు మెటర్నరీ లీవు తీసుకున్నారు. తన పదవీకాలంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళానేతల్లో జూలీ ఒకరు.
న్యూజిలాండ్‌లో 1970లో మొదటిసారి ఒక మహిళా ఎంపీ తన పదవీకాలంలో బిడ్డకు జన్మనిచ్చారు. 1983లో మరో మహిళానేత పనిచేస్తున్నప్పుడు బిడ్డకు చనుపాలు తాగించి వార్తల్లో నిలిచారు. 2016లో ఆస్ట్రేలియా తమ దేశ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఉన్న మహిళానేతలు పనిచేస్తున్నప్పుడు తమ పిల్లలకు పాలు తాగించడానికి అనుమతిని ఇచ్చింది. ఇటీవల ఐరోపా యూనియన్‌లో ఇటలీ, స్వీడన్ మహిళా సభ్యులు తన బిడ్డను ఎత్తుకుని ఓటువేయడంలో వార్తల్లో నిలిచారు.

-విశ్వ