Others

బాలీవుడ్ డ్రీమ్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేటెస్టుగా గీతగోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్, అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం విజయ్ అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. ఒక్క టాలీవుడ్‌లోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా మనోడికి మంచి ఇమేజ్ దక్కింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నోటా చిత్రంలో నటిస్తున్న ఆయన, మరోవైపు భరత్‌కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆయన నటించిన అర్జున్‌రెడ్డి సినిమా ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. తాజాగా విడుదలైన గీతగోవిందం సినిమా అటు తమిళంలో కూడా మంచి హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి స్పందించాడు. నాకు బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు.. ఒకవేళ బాలీవుడ్ వెళ్లాలంటే దానికి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ దొరకాలిగా అంటున్నాడు విజయ్.