Others

బయోపిక్‌ల హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు సౌత్‌లో కూడా బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ముఖ్యంగా సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సంచలన విజయంతో ఈ సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఇప్పటికే అన్న ఎన్టీఆర్, వై.ఎస్ యాత్ర, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటివారి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ సిఎం జయలలిత బయోపిక్ తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు జోరందుకున్నాయి. జయలలిత పాత్రలో విద్యాబాలన్, నయనతార, కీర్తి సురేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎవరనే విషయం కూడా తెలిసింది. ఈ చిత్రానికి ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తాడట. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తాడట. అన్నట్టు ఇదే బ్యానర్‌లో కపిల్‌దేవ్ బయోపిక్‌ని కూడా నిర్మిస్తారట. దానికి ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తాడని ఆ చిత్రానికి 53 అనే టైటిల్ ఖరారు చేసారు. సో త్వరలోనే జయలలిత బయోపిక్ సెట్స్‌పైకి రానుంది.