Others

పాదుకా పట్ట్భాషేకం (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లాష్‌బ్యాక్ @ 50

అమరావతి చిత్ర పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి కథ వాల్మీకి రామాయణం ఆధారం.
రచన: వడ్డాది
నృత్యం: వేణుగోపాల్
కెమెరా: వెంకటి, జనార్ధన్
కూర్పు: తంగవేలు
కళ: గోడేగాంకర్
సంగీతం: ఘంటసాల
నిర్మాత: ఆర్‌సి రెడ్డి
దర్శకత్వం: వసంతకుమార్‌రెడ్డి

బొంబాయిలోని సాగర్ ఫిల్మ్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజరుగా ఉన్న చున్నిభాయి దేశాయ్ కొందరు భాగస్తులతో కలిసి సాగర్ ఫిలింస్ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారు. తెలుగులో ప్రసిద్ధిచెందిన నాటకం ‘రామ పాదుగా పట్ట్భాషేకం’ ఆధారంగా 1932లో సర్వోత్తమ బాదామి దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించారు. బొంబాయిలో చిత్ర నిర్మాణం సాగింది. సురభి కమలాబాయి, అద్దంకి శ్రీరామమూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. 1945లో శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ పతాకంపై కడారు నాగభూషణం, ‘పాదుకా పట్ట్భాషేకం’ రూపొందించారు. పుష్పవల్లి (సీత), సియస్‌ఆర్ (శ్రీరాముడు), కన్నాంబ (కైక), కొచ్చర్లకోట సత్యనారాయణ (లక్ష్మణుడు), బందా కనకలింగేశ్వరరావు(్భరతుడు), అద్దంకి శ్రీరామమూర్తి దశరధుడిగా నటించారు.
ఆ తరువాత పొన్నలూరి బ్రదర్స్ పేరిట ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని తీసిన నిర్మాతల్లో ఒకరైన వసంత కుమార్‌రెడ్డి దైవబలం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలోనే 1966లో ‘పాదుకా పట్ట్భాషేకం’ మళ్లీ రూపొందింది. అది 1966 జూన్ 16న చిత్రం విడుదలైంది. వడ్డాదిగా పేరుపొందిన రచయిత ‘బుచ్చి కూర్మనాథం’ పలు అనువాద చిత్రాల రచయితగా రాణించారు. 1956లో ఇలవేలుపు చిత్రానికి ‘చల్లని రాజా ఓ చందమామా’లాంటి కొన్ని పాటలు వ్రాసారు. ‘పాదుకా పట్ట్భాషేకం’ చిత్రానికి మాటలు, పాటలు ఈయనే వ్రాయటం విశేషం. వాల్మీకి మహర్షి చిత్రాన్ని చూపుతూ వాల్మీకి రామాయణం ఆధారంగా చిత్ర నిర్మాణం సాగిందని టైటిల్స్ ప్రారంభమవుతాయి. ఘంటసాల ప్లేబాక్‌తో పాట నడుస్తుంది.
విశ్వశాంతికి ప్రయత్నించమని బ్రహ్మను భూదేవి కోరటం, దానికి బ్రహ్మదేవుడు సరస్వతి సాయం కోరటంతో చిత్రం ప్రారంభమవుతుంది. దశరథుడు (్ధళిపాళ) దుస్వప్నం (నల్లని వస్త్రాలు, కపాలాలతో కూడిన కల) కన్నంతనే వశిష్ట మహాముని (కెవిఎస్ శర్మ), సుమంత్రుడు (మల్లాది)లతో సంప్రదించి పెద్ద కుమారుడైన శ్రీరామునికి (కాంతారావు) పట్ట్భాషేకం చేయ నిశ్చయిస్తాడు. మంచి ముహూర్తాలు తరువాత లేనందున మూడు రోజుల్లో శుభలగ్నం నిర్ణయిస్తారు. భరత, శతృఘు్నలు తాతగారి రాజ్యానికి (కైక తండ్రి) వెళ్లి ఉండటంతో, వశిష్ట, వామదేవులు (వంగర) వారికి వర్తమానం అందించలేకపోతారు. గంగా స్నానానికి వెళ్ళిన కైకకు (లీలావతి) వర్తమానం అందిస్తారు. రాజ్యానికి వచ్చి శ్రీరాముని పట్ట్భాషేకం వార్త విని కైక ఆనందిస్తుంది. మందర (సూర్యాకాంతం) దుర్భోదలు, సరస్వతిదేవి ఆమెను ఆవహించటంతో భర్త దశరథుడు తనకు లోగడ ప్రసాదించిన రెండు వరాలు తీర్చమని కోరుతుంది. ఒకటి భరతునికి పట్ట్భాషేకం, రెండవది శ్రీరామునికి వనవాసం. ఆమెను సముదాయింప దశరథుడు అశక్తుడౌతాడు. తండ్రి ఆదేశాన్ని పినతల్లి కైకనుంచి తెలిసికొన్న శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడై వనవాసం వెళ్తాడు. దారిలో గుహుని (మిక్కిలినేని) సాయంతో గంగానది దాటి, భరద్వాజుని సందర్శించి చిత్రకూటంలో నివసిస్తుంటాడు. తాతగారింటి నుంచి వచ్చిన భరతుడు, రాముని వియోగంతో మరణించిన తండ్రి అంత్యక్రియలు నిర్వర్తిస్తాడు. తనకు రాజ్యం వలదని, కోరరాని కోరిక కోరినందుకు తల్లి కైకను నిందిస్తాడు. శతృఘు్నడు (నాగరాజు) సహా పరివారంతో శ్రీరామునివద్దకు వెళతాడు. శ్రీరాముడినే రాజ్యభారం వహించమని భరతుడు కోరిన కోర్కెను రాముడు తిరస్కరించగా, దానికి భరతుడు రామునికి మారుగా అతని పాదుకలనిమ్మని, వాటితో తాను రామప్రతినిధిగా రాజ్యభారం వహిస్తానంటాడు. 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని శ్రీరాముడు రానిపక్షంలో ప్రాయోపవేశం చేస్తానని శపధం చేస్తాడు. దానికి సమ్మతించిన రాముని పాదుకలను భరతుడు తలపై ధరించి, తెచ్చి సింహాసనంపై ఉంచి పట్ట్భాషేకం చేయటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో సీతగా కృష్ణకుమారి పాత్రోచితంగా నటించారు. తక్కువ మాటలు, ఎక్కువ భావవ్యక్తీకరణ, సాత్వికాభినయంతో సీత పాత్రను రక్తికట్టించారు. భరతుని పాత్ర పోషించిన బాలయ్య తన నటనతో మెప్పించారు. అన్న రామచంద్రుడి పట్ల భక్తి, అభిమానం, వాత్సల్యం, జరిగిన అనర్ధానికి తల్లి కైకను నిందించటం, తిరిగి ఆమెను సముదాయించటం, శ్రీరాముని ఒప్పించి పాదుకలను రాజ్యానికి తేవటం లాంటి సన్నివేశాలను పాత్రోచితంగా రక్తికట్టించారు. లక్ష్మణునిగా నూతన నటుడు శశికాంత్ నటిస్తే.. రాముని అనుసరించమని భర్తకు చెప్పే సన్నివేశంలో ఉర్మిళగా జయంతి కొద్దిసేపు కనిపిస్తారు. కౌసల్యగా మాలతి, సుమిత్రగా నటి సంధ్య సోదరి విద్యావతి, మర్మయోగి చిత్రంతో వాంప్ పాత్రతో మెప్పించిన కన్నడ నటి లీలావతి కైకగా తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. శ్రీరామునిగా కాంతారావు సహజసిద్ధమైన నటనతో అలరించారు. పౌరాణిక పాత్ర పోషణలోని మెళకువ, శ్రద్ధను ప్రదర్శిస్తూ పాత్రలో ఒదిగిపోయారు.
కైక దశరధుని వరాలు కోరడం, శ్రీరాముడిని గుహుడు గంగానదిని దాటించడం లాంటి సన్నివేశాలను దర్శకుడు వసంతకుమార్ రెడ్డి వైవిథ్యంగా చిత్రీకరించారు. నదిని దాటించే సమయంలో పడవ అలంకరణ, ఆ సమయంలో గీత చిత్రీకరణ అద్భుతంగా అనిపిస్తుంది. ‘రామయ తండ్రి, రఘురామయ తండ్రి’ (ఘంటసాల) పాట -తరువాత బాపూ రూపొందించిన సంపూర్ణ రామాయణంలోని గుహుని పాటకు స్ఫూర్తిగా నిలిచిందనుకోవాలి. సీతారాముల ముందు కోయ బాలికలు ప్రదర్శించే నృత్య గీతం ‘వినరయ్యా రామగాథా’ (వైదేహి బృందం) నేటికీ వినిపించే అద్భుత గీతమే. సీతారాములపై చిత్రీకరించిన ఊహాగీతం (మేఘాల్లో చక్కని సెట్టింగ్స్‌తో కనువిందుగా సాగుతుంది) -ఓ సుందర ప్రకృతి జగతీ’ దర్శకుని అభిరుచికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో సందర్భోచిత పద్యాలను ఘంటసాల, రాఘవులు, పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించారు. శ్రీరాముని సుప్రభాతాన్ని, మంగళం గీతాన్ని చిత్రంలో వినిపింపచేశారు. సక్సెస్‌తో సంబంధం లేకుండా మంచి ప్రయత్నం చేసిన నిర్మాత, దర్శకులు అభినందనీయులు. ‘పాదుకాపట్ట్భాషేకం’లో సీతగా కృష్ణకుమారి నటించటం ఆమె నట జీవితంలోని పౌరాణిక పాత్రల్లో ఎన్నదగిన పాత్ర అయ్యంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి