Others

వరకట్న దాహమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మనిషి తన తెలివిగా దినదినాభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. కానీ మాననీయ విలువలు, దయాగుణం మంటగలిసి పోతున్నాయి. మనిషి తన కోర్కెలు తీర్చుకోవడానికి ఎంతకయినా సిద్ధహస్తుడవుతున్నాడు. అందులో భాగంగా సాటిమనిషిని, పెళ్ళి పేరుతో మూడు ముళ్ళు వేసి తనలో సగంగా చేసుకున్న మగాడు కట్నకానుకల కోసం భార్యలను చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నాడు. ఒకప్పుడు కన్యాశుల్కం, వరదక్షిణ లాంటివి ఉండేవి. కన్యాశుల్కమనేది ధనవంతులయిన అవివాహ పురుషుడు (వివాహానికి పనికిరాని వాడు - ముసలి, మానసిక వికలాంగులు) పేదింటి అమ్మాయిపై మోజుపడి అమ్మాయి తల్లిదండ్రులకు ధనం మీద ఆశ చూపి పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఆ తరువాత అది రానురాను వరదక్షిణ రూపంలోకి వచ్చింది. దీని ఉద్దేశ్యమేమిటంటే ధనవంతులయిన అమ్మాయి తల్లిదండ్రులు వివాహ సమయంలో తమ కూతురికి స్ర్తి ధనంగా భూమి, నగలు, గోవులు లాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు ఇది రానురాను వరకట్నంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరు కూడా వరకట్నం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేయడం లేదు. వరకట్నం ఇవ్వకుంటే చాలా నామోషీగా భావిస్తున్నారు. కొంతమంది అయితే సంఘంలో హోదా కోసం తాహతుకుమించి అప్పులు చేసి మరీ కట్నాలు లక్షలు, కోట్లలో ఇస్తున్నారు. ఇలా ఇచ్చేసరికి ఈ కట్నాలే అమ్మాయిల ప్రాణం మీదకు తెస్తున్నాయి. ధనం మీద ఆశతో భర్త భార్యను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం తెల్లవారితే ఆత్మహత్యలు చేసుకున్న వారి నైతేనేమి, నిర్దాక్షిణ్యంగా అత్తవారి కుటుంబ సభ్యులంతా కలిసి ప్రాణాలు తీస్తున్న వార్తలు, సంఘటనలు కోకొల్లలు. ఇలాంటివి చూస్తుంటే సతీసహగమనం కన్నా దారుణమనిపించక మానదు.
అయితే ఇలాంటి వరకట్న దాహానికి బలవుతున్న వారికోసం ప్రభుత్వం 02.10.1985న ‘‘వరకట్న నిషేధ చట్టం’’ను అమలులోకి తెచ్చింది. అమల్లోకి తేవడంతోనే ప్రభుత్వం బరువు, అధికారుల బాధ్యత అయిపోయింది. కానీ ‘‘వరకట్న నిషేధ చట్టం’’ ఇప్పటికీ అమలుకావడం లేదు. కాబట్టి ఇలాంటి వరకట్న బాధిత హత్యలన్నీ ప్రభుత్వాలు, అధికారులు చేస్తున్న హత్యలుగానే చెప్పుకోవడంలో ఎంతమాత్రం తప్పులేదు. అమలుకాని చట్టం ఉండెందుకు? లేకెందుకు? నూటికి నూరుశాతం వరకట్నం తీసుకోకుండా జరిగినటువంటి పెళ్ళిళ్ళు లేవు. ఇదేమిటంటే ప్రెస్టేజ్ ఇష్యూ అన్న సమాధానమే ప్రతిచోటా కనబడుతోంది. ప్రతి ఒక్కరి నోటా వినబడుతోంది. కేవలం ప్రభుత్వాలదే అనుకుంటే పొరపాటే అవుతుంది. అంతకంటే ఎక్కువ తప్పులు మొదటగా అమ్మాయి తల్లిదండ్రులు చేస్తున్నారు. అమ్మాయికి కట్నకానుకలు ఇస్తున్నారు, అదే ఇంట్లో అబ్బాయిలకు కట్నకానుకలు తీసుకుంటున్నారు. అత్తవారింట్లో వీళ్ళ అమ్మాయికి జరిగిన పరిణామాలు, పరిస్థితులే వీరింట్లో కూడా జరుగుతున్నాయి. అంటే తప్పు ఒక్కరిదో, ఇద్దరిదో కాదు సమాజం మొత్తానికి. అదనపు కట్నం కోసం భార్యలను చంపి కోర్టుల చుట్టూ తిరుగుతున్న భర్తలు, వారి కుటుంబాలెన్నో. అత్యాశతో, కష్టం కలుగకుండా వచ్చే డబ్బుకోసం భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువత ఎంతో మంది ఉన్నారు. వరకట్నం కోసం తల్లిదండ్రులు ఆశపడినప్పటికీ, అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న యువత మరెందుకు ఆలోచించి ఇలాంటి వాటి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోలేకపోతుంది? హోదా, ప్రతిష్ట, డామినేషన్ ఇవన్నీ యువతను చెడుదారి పట్టిస్తున్నాయి. యువత ఇప్పటికయినా మేల్కొంటే వరకట్న దురాచారాన్ని పూర్తిగా అరికట్టవచ్చు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431