Others

అలుపెరుగని పోరుకు అత్యున్నత పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది నదియా మురద్, డెనిస్ ముక్‌వెగెలకు సంయుక్తంగా లభించింది. నదియా మురద్ ఇరాక్‌లోని యాజిదీ తెగకు చెందిన ఇరవై మూడేళ్ల యువతి. ఈమె మానవ హక్కుల కార్యకర్త. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల కారణంగా తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిదీ యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేసింది నదియా. ఇందుకుగాను 2016లో ఆమెకు వక్లావ్ హావెల్ మానవ హక్కుల అవార్డు లభించింది. లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికి గాను ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి లభించింది. యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని నిర్మూలించేందుకు డెనిస్, నదియా మురద్‌లు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతితో గుర్తింపు లభించింది.