Others

తెనాలి రామకృష్ణ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికె వెంకట రాఘవయ్య నాటకం ఆధారంగా తీసిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా నాకు చాలా ఇష్టం. తెనాలి గ్రామవాసి రామకృష్ణ (అక్కినేని నాగేశ్వరరావు) పేదవాడు. భార్య కమల (జమున), కొడుకు మాధవ (మాస్టర్ వెంకటేశ్వర్)తో కలిసి తల్లిదగ్గరే ఏవో కావ్యాలు రాస్తూ కాలం గడుపుతుంటాడు. ‘తాటాకులు తేరగా వచ్చాయని ఎడతెరిపి లేని ఏమి రాతరా. రాసిన కావ్యాలు ఎవరికైనా చూపించి కుటుంబాన్ని పోషించుకోవాలి గాని’ అని తల్లి మందలిస్తుంది. తల్లి మాటతో తాను రాసిన కావ్యాలు వూరిలోని ఓ సాహిత్య ప్రియునికి వినిపిస్తే, పామరులకు అర్థంకాని రచనలేల? అంటాడతను. కోపగించిన రామకృష్ణ కావ్యాలను విసిరికొడతాడు. ఓ బైరాగి వాటిని చదివి, విజయనగరం వెళ్ళి మహారాజు శ్రీకృష్ణదేవరాయలకు రచనలు వినిపిస్తే శుభం జరుగుతుందని దీవిస్తాడు. రామకృష్ణ భార్యా పిల్లాడితో విజయనగరం వెళ్తాడు. అడవిదారిలో కొందరు పల్లెవాళ్లు అమ్మోరి జాతర జరుపుకుంటూ మేకపిల్లను బలికి సిద్ధం చేస్తారు. వారిని అడ్డుకుని మేకపిల్లను వదిలేస్తాడు రామకృష్ణ. వారంతా తిట్టుకుంటూ ‘నాయన మాకు అడ్డొస్తే వచ్చావు. ఇక్కడ వుండమాక. అర్ధరాత్రి అమ్మోరు తిరుగుతుంది’ అని హెచ్చరిస్తారు. రామకృష్ణ వెళ్లకుండా అర్ధరాత్రి అమ్మోరి విగ్రహంముందు నిలబడి ఆమెను ‘ఎందుకమ్మ ఈ భయంకర రూపం’ అని ప్రశ్నిస్తాడు. అంబ ఆగ్రహానుగ్రహంతో వికట కవిగా మారతాడు. అలా రామకృష్ణ విజయనగరం వెళ్ళడం, తాతాచార్యులు (మిక్కిలినేని) ద్వారా రాజ దర్శనానికి ప్రయత్నించి విఫలమైన సన్నివేశాలు సరదాగా.. బాధగా సాగుతాయి. న్యాయస్థానంలో ముగ్గురు అన్నదమ్ములు చరాస్థి పంపకాల సన్నివేశంతో శ్రీకృష్ణదేవరాయల (ఎన్.టి.ఆర్) కొలువులోకి చేరతాడు రామకృష్ణ. తరువాత శ్రీకృష్ణదేవరాయలు, మహామంత్రి అప్పాజీ మన్ననలు పొంది రాజాశ్రయం పొందుతాడు. ఇక్కడ భువన విజయం, శ్రీకృష్ణ దేవరాయలవారి సభాప్రాంగణం ఆనాటి వైభవాన్ని చూపుతాడు ఛాయాగ్రాహకుడు వి.ఎస్.రంగాచారి. వికటకవి తన కవితా చాతుర్యంతో అష్టదిగ్గజాలలో ఒకడుగా ఎదుడం, మహామంత్రి తిమ్మరుసు అనుంగు శిష్యుడై నిరంతరం విజయనగర సాప్రాజ్య రక్షణకు పాటుపడే ప్రభుభక్తి పరాయణుడై చక్రవర్తికి తోడుగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాటుపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయ. సంగీతపరంగా పాటలు, పద్యాలు అన్నీ సందర్భోచితంగా వస్తాయి. ఒకచోట జయదేవుని అష్టపది ఎంతో చక్కగా వినియోగించుకున్నాడు దర్శకుడు. నటనాపరంగా ఎవరినీ తక్కువ, ఎక్కువ చూడలేము. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటిలాంటి కవులు ఇలాగే వుంటారేమో అనేటట్టుగా వుంటుంది. పాటలు, పద్యాలు అందరికీ అర్ధమయ్యేలా రాసిన సముద్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్రానికి సంగీతం విశ్వనాథన్‌రామూర్తి, దర్శక నిర్మాత బిఎస్ రంగా. ఎప్పటికీ మరపురాని చిత్రమిది.

-కూచిమంచి నాగేంద్ర, ఏలూరు