Others

జగన్నాథుని విశిష్టతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చందనోత్సవంతోపూరీ జగన్నాథుని రథాల తయారీకి శ్రీకారం జరుగుతుంది. దీని మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. నరేంద్రకొలనులో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. చందనం ఇతర పరిమళ ద్రవ్యాలతో కొలను నడుమ వున్న చిన్న ఆలయంలోని రాతి గినె్నలలో వున్న నీటితో జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రా దేవులతో పాటు గా సుదర్శన చక్రానికి పుణ్యస్నానాలు చేయిస్తారు.దీని తరువాత పౌర్ణమి తిథినాడు 108 కళశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు సామాన్య భక్తులకు దర్శనం నిలిపివేయబడుతుంది. దేవతామూర్తులకు అడ్డుగా వెదురుతో నిర్మించిన తడకలాంటిది అమరుస్తారు. ఈ రోజుల్లో జగన్నాథ బృందానికి నైవేద్యంగా పళ్లు, ఆకులు, కందమూలాలు నివేదన చేస్తారు. ఆ తరువాత ఈ దేవతామూర్తుల కు కొత్త రంగులు వేస్తారు. ఈ రంగులన్నీ సహజసిద్ధంగా తయారు చేసిన రంగులు మాత్రమే. కళ్లకు రంగులు వేసినపుడు దీన్ని నేత్రోత్సవంగా పిలుస్తూ జగన్నాథ భక్తులు స్వామిని దర్శిస్తారు.
భక్తావేశం శరీరంలోని అణువణువునా భక్తి నిండిన భక్తజనం గంటలు, భాజా భజంత్రీలు, ఇంకా తమకు తోచిన వాయిద్యాలను వాయిస్తూ, తమ ఆనందపరవశాన్ని వ్యక్తం చేసే నేపథ్యంలోస్వామి నేతోత్రత్సవం కనులప ండుగగా ఉంటుంది. దీన్ని దర్శించ డానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు వస్తారు.
ఈ స్వామి రూపమే కాదు స్వామికి నివేదన కూడా తన దైన ప్రత్యేకతను చాటుతోంది.్భగవంతుని ఉచ్చిష్టమే జగం కనుక దీని నిరూపణకా అన్నట్టు ఇక్కడ స్వామి నివేదన పదార్థాలను ఎంగిలి అన్న పదం వాడకుండా ప్రతి ఒక్కరూ మహాప్రసాదమంటూ స్వీకరిస్తారు. దీని తయారీ కూడా ప్రత్యేకమైన దొంతరులుగా పేర్చిన పిడతలల్లో స్వామికి అన్నాన్ని వివిధ రకాల కాయగూరలతో వండుతారు. స్వామికి నిత్యం ఏడుసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. మొట్టమొదట బాల భోగాన్ని సమర్పించిన పండాలు రాజభోగం (అన్నం) ఛత్రభోగం (అన్నం పప్పు) మధ్యాహ్నవేళ భోగం, సంధ్యాహారితి, సోమధూపం అని ఆరువిధాలుగా నైవేద్యాన్ని సమర్పించి చివరకు బడే శింగార్ అనే భోగాన్ని అర్థరాత్రి ఏడవ భోగంగా స్వామిని నివేదన చేస్తారు.

- హనుమాయమ్మ