Others

నాకు నచ్చిన పాట..మనిషై పుట్టినవాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా సంగీతంలో సముద్రాల తర్వాత సాహిత్యాన్ని సమపాళ్లలో జోడించిన మధురకవి వేటూరి సుందరరామ్మూర్తి. ఆయన కలంనుండి జాలువారిన ‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ/ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ’ అన్న గీతం అడవి రాముడు చిత్రానికే హైలైట్. సకల శాస్తస్రారం, జీవితానుభవం మేళవించి ప్రబోధాత్మకంగా మనిషిని చైతన్యపరుస్తూ రాసిన గీతమిది. ప్రతిభావ్యుత్పత్తుల్లో దేనికదే ప్రధానం. అందులోని రెండో అంశమే కృషి. ‘కృషితోనాస్తి దుర్బిక్షం’ అనేది పెద్దలు నుడివిన మాట. సుందరరామ్మూర్తికి శబ్దాలంకార ప్రయోగం అంటే సరదా. ఆ పదాలను అలవోకగా ప్రయోగిస్తారు. మట్టిబొమ్మ తర్వాత మరో బ్రహ్మను కూర్చినట్టు మనుషులు, రుషులు, మహాపురుషులు అనే పదాలను సందర్భోచితంగా ఉపయోగించి ఆ పాటకు వనె్నతెచ్చారాయన. ఆయన అన్ని చిత్రాల్లోని అన్ని పాటలను ప్రేక్షకులు ఆదరించారు, ఆనందించారు.
1940లో ప్రారంభమైన ‘టార్జాన్’ మూలకథను అల్లుకొని ఎన్నో తెలుగు చిత్రాలు వచ్చాయి. చాలా చిత్రాల్లో ఏనుగుకు ప్రాధాన్యత ఇచ్చి వాటిచేత సాముగరిడీలు చేయించారు దర్శకబ్రహ్మలు. అపార జ్ఞానశక్తి, మీదుమిక్కిలి యజమాని పట్ల విధేయత ఎనుగు లక్షణం. ఈ అంశానే్న అడవిరాముడులోనూ చిత్రీకరించారు. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రంలో అన్ని పాటలూ ఆణిముత్యాలే. ఎస్పీబీ నేపథ్యగానంలో పాటలన్నీ ప్రబోదాత్మకంగా, ఆనందించదగ్గవిగా ఉంటాయి.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం