Others

నన్నలా చూడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’లో జగపతిబాబు పోషించిన ‘బసిరెడ్డి’ పాత్ర లేకుండా ఊహించుకోవడం కష్టమే. విలనిజంతో మెప్పిస్తున్న జగపతిబాబుతో ఇంటర్వ్యూ...
మీ పాత్రకు వస్తున్న రెస్పాన్స్?
- హ్యాపీగావుంది, మంచి పాత్ర పోషించినందుకు. అందరూ బాగాచేసానని అభినందిస్తున్నారు. మంచి రెస్పాన్స్.
మీ పాత్ర లేకుంటే సినిమా లేదని టాక్ వస్తుంది. మీరేమంటారు?
- అలా అనుకోవడం తప్పు. అలాంటి మాటలు నమ్మను కూడా. ఏ సినిమాకైనా ఆ పాత్రలు, ఆ రేంజ్ నటులుంటేనే పండుతుంది. ఈ సినిమా విషయంలో అలాంటి పాత్రలు కుదిరాయి. పైగా తనకంటే ఎక్కువ ఇంపాక్ట్ విలన్ పాత్రకు ఉండటం విషయంలో తారక్‌ని అభినందించాలి. ఎందుకంటే ఏ హీరోకూడా తనను డామినేట్ చేసే విలన్ ఉండాలని అనుకోడు. కానీ తాను ఈ కథను అంతగా నమ్మాడు.
హోమ్‌వర్క్ లాంటిది చేసారా?
-పాత్ర గురించి త్రివిక్రమ్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. విలనిజం పాత్రలు చేస్తున్న నాకే కొత్తగా అనిపించడంతో ఇంకా ఏదైనా గొప్పగా చేయగలమన్న కాన్ఫిడెంట్ కలిగింది. ముఖ్యంగా ఓపెనింగ్ సీన్‌లో నోటిలో బుల్లెట్ పెట్టుకుని... ఎన్టీఆర్‌ని చూడగానే... కూన లేతగా ఉండాది... నరపరెడ్డి... అని చెప్పే డైలాగ్‌లోనే పాత్ర తాలూకు స్వభావం తెలిసిపోయింది.
డబ్బింగ్ విషయంలో..?
-ఏ సినిమాకైనా డబ్బింగ్‌తో బెటర్‌మెంట్ చేయొచ్చు. ఈ సినిమాకోసం అలాంటి ప్రయత్నం చేశాను. వాయిస్‌కి బాగా కనెక్టయ్యారు.
రాయలసీమ యాస ఎలా ఉంది?
-పెంచల్‌దాస్‌కు థాంక్స్ చెప్పాలి. డబ్బింగ్ సమయంలో తాను దగ్గరే ఉండి ప్రతి డైలాగ్ విషయంలో, స్లాంగ్ విషయంలో జాగ్రత్తలు చెప్పాడు. అతన్ని ఫాలో అయ్యాను.
ఎన్టీఆర్‌తో రెండోసారి..?
-నాన్నకు ప్రేమతో తరువాత మా కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. సినిమాకోసం ఏదైనా చెయ్యాలన్న కసి ఉన్నది అతనిలో.
త్రివిక్రమ్ గురించి ఏం చెబుతారు?
-త్రివిక్రమ్ గొప్ప దర్శకుడని అందరికీ తెలుసు. డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతనికీ సినిమా అంటే గొప్ప ప్యాషన్. క్లైమాక్స్ సమయంలో హీరో, విలన్‌ల మధ్య ఫైట్ సీన్స్ తప్పవనుకుంటూ వెళ్ళా. కట్ చేస్తే.. క్లైమాక్స్‌లో ఫైట్ సీన్స్ వద్దనుకున్నారు. అది చాలదా.. త్రివిక్రమ్ గురించి చెప్పడానికి.
విలన్‌గా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో...?
-ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తున్నాను. నేను విలన్‌ను కాదు. అది రీల్ లైఫ్‌లో అయినా రియల్ లైఫ్‌లో అయినా. నేను బేసిగ్గా నటుడిని. పాత్రకు వంద శాతం న్యాయం చేయడమే నా పని.
మీరేమో సాఫ్ట్. మరి ఇంత రఫ్‌గా విలనిజం చేయడం ఎలా ఉంటుంది?
-బేసిగ్గా నేను ఏదైనా నమ్మితేనే చేస్తా. నమ్మలేకపోతే అది ఎంతదైనా చేయను. నేను స్వతహాగా సాఫ్ట్‌అయినా కూడా నేను చేస్తున్నది సినిమాలోని పాత్ర. అంతేకానీ రియల్‌గా కాదుగా. ఆ పాత్ర గురించి నన్ను నేను రెడీ చేసుకున్నాకే కెమెరాముందుకు వస్తా.
ఈమధ్యే వెబ్ సిరీస్ చేసారు... ఇకపై చేస్తారా?
-తప్పకుండా చేస్తా... అలాంటి మంచి కథలు వస్తే వింటున్నా. ఇప్పుడు అంతా చిన్న స్క్రీన్‌లదే హవా.. పెద్దస్క్రీన్ కొంతవరకే పరిమితం.
ఈ ఏడాదిలోనే భిన్నమైన పాత్రలతో మెప్పించారు? దానికి మీ ఫీలింగ్?
-నిజమే రంగస్థలంలో ప్రెసిడెంట్ పాత్ర, గూఢచారిలో టెర్రరిస్ట్... ఇప్పుడేమో ఫ్యాక్షనిస్ట్.. అలాంటి రోల్స్ వస్తున్నాయి. రొటీన్‌గా ఉండే పాత్రలో చేయను. భిన్నంగా ఉందని అనిపిస్తేనే చేయడానికి ఆసక్తి చూపిస్తా.
ప్రొడక్షన్ మొదలుపెట్టారు.. సినిమా ఎప్పుడు?
-నేను సినిమాలు నిర్మించను. నాకు తెలిసిన ఎన్నారై ఫ్రెండ్స్ మొదలుపెడితే సపోర్ట్ ఇచ్చాను తప్ప సినిమాలు నిర్మించడం నాకు చేతకాదు. ఎందుకంటే నాకు మనీ మేనేజ్‌మెంట్ తెలియదు. పైగా నేనే మనీ మైండెడ్ కూడా కాదు. నాకు లౌక్యం తెలియదు.. సినిమా నిర్మించానంటే అంతా పోగొట్టుకోవలసిందే.
తదుపరి చిత్రాలు?
-ప్రస్తుతం మెగాస్టార్‌తో సైరాచేస్తున్నా. అలాగే తమిళంలో సూర్య, అజిత్‌లతో రెండు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో ఒకటి, హిందీలో కూడా ఓ ప్రాజెక్ట్ ఓకే అయింది.

-ఎస్సార్