Others

గుండమ్మ కథ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాకు బీఎన్ రెడ్డి నిర్మాతగా పెట్టుబడి పెట్టాడంటే -కచ్చితంగా ఆ సినిమా కథ చక్రపాణి రాసి ఉండాలి. మార్కస్ బార్ట్లె సినిమాటోగ్రాఫరై ఉండాలి. వీళ్లంతా విజయ వాహిని స్టూడియోస్‌లో ఉండుండాలి. నాకు నచ్చిన సినిమా ఈపాటికి రీళ్లు రీళ్లుగా మీకూ గుర్తొచ్చే ఉంటుంది. ఒకవేళ చాలా చిత్రాలే మదిలో మెదిలితే -అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే -గుండమ్మ కథ. పైన చెప్పుకున్నంతమంది ఉద్దండుల్ని బ్యాలెన్స్ చేయగల దర్శకుడు తెలుగులో ఒక్కడే ఉన్నాడు. ఆయనే కమలాకర కామేశ్వర రావు. ఈ చిత్రానికి దర్శకుడు. 1962లో అంటే 55 ఏళ్లక్రితం వచ్చిన ఈ చిత్రం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అపురూపం, ఆణిముత్యం. ఇప్పుడు ఇంగ్లీష్ చిత్రాల్ని కాపీకొట్టి తెలుగు సినిమాలు తీస్తున్నట్టే -అప్పట్లో ఇంగ్లీషు నవల (షేక్స్‌పియర్ -ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ) ఇన్‌స్పిరేషన్‌తో తెలుగులో రాసుకున్న కామెడీ కథ. దీనికంటే ముందు 1958లో ‘మనే తుంబిడ హెన్ను’ టైటిల్‌తో మహా దర్శకుడు విఠలాచార్య ఈ కథను టచ్ చేశారు. అది వేరే విషయం.
కథేంటంటే -్ధనవంతురాలైన విధవ గుండమ్మ (సూర్యకాంతం). సవితి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పనిమనిషిగా, సొంత కూతురు సరోజ (జమున)ను అల్లారు ముద్దుగా చూస్తుంటుంది. తోడికోడళ్లు అక్క చెల్లెళ్లయితో ఇబ్బందులు ఉండవన్న ఆలోచనతో ఆ ఊరి జమీందారు (ఎస్వీ రంగారావు) తన ఇద్దరు కొడుకుల్ని గుండమ్మ కూతుళ్లకు చేయాలనుకుంటాడు. అంజి (ఎన్టీఆర్), రాజా (ఏఎన్నాఆర్)లుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన అన్నదమ్ములు అక్కడి పరిస్థితులను మార్చి వాళ్లను ఎలా పెళ్లి చేసుకున్నారన్నదే మూల కథ. చిత్రమేటంటే ఈ సినిమా ఎన్టీఆర్‌కు వందో చిత్రం. ఏఎన్నాఆర్‌కు 99వ చిత్రం. అందుకే -ఎన్టీఆర్ అన్న, ఏఎన్నార్ తమ్ముడిగా చేశారేమో. స్క్రీన్‌మీద కనిపించే దృశ్యానికి, తారల మోముపై పలికే భావాన్ని సింక్ చేస్తూ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు స్వర పాఠశాల -ఘంటసాల. అందుకే -గుండమ్మ కథ సినిమా కాదు. అందమైన క్లాసిక్ జీవితం. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ప్రతిసారీ ఓ ఫ్రెష్ ఫీలింగ్. ప్రతి సన్నివేశంలోనూ ఓ కొత్త భావన. ఇప్పుడొస్తున్న చిత్రాల్లో మనకు గొప్పగా అనిపించిన వెయ్యి చిత్రాలను మిక్సీలోవేసి జ్యూస్‌చేసి ఒడకెడితే వచ్చే అద్భుత సినీపానమే -గుండమ్మ కథ అనుకోవాలి. అంతెందుకు ఏ మూడ్‌లో సినిమా చూసినా -ఫ్రెడ్ మూడ్‌లోకి రావడం ఖాయం. నిజానికి గుండమ కథ సినిమా కాదు -వత్తిడిని జయించే ఒక యోగ.

-కె ప్రసన్నరాణి, పాలకొల్లు