Others

ఆమని పాడవే.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు పెడితే మణిరత్నానికి మించిన ‘రత్నం’ లేదు -అన్నది అభిమానుల మాట. నిజమే -మామూలు కథని క్లాసిక్ చేయగల సత్తా ఆయనలో ఉంది మరి. అలాంటి మణిరత్నం డిజైన్ చేసిన గొప్ప తెలుగు క్లాసిక్స్‌లో -గీతాంజలి ఒకటి. అందులోని ‘ఆమని పాడవే కోయిలా’ పాటంటే నాకు చాలా ఇష్టం. ఏముంది అందులో..? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానంగా సినిమా గురించి చెప్పుకోవాలి. ఊహల్లోని రొమాంటిక్ మూడ్‌ని అంతకుమించి స్క్రీన్‌పై చూపెట్టగల మణిరత్నం -1989లో డిజైన్ చేసిన చిత్రమిది. నాగార్జున, గిరిజా షెట్టర్ హీరో హీరోయిన్లు. చిన్న యాక్సిడెంట్ కారణంగా ప్రకాష్ (నాగ్) ఆస్పత్రిలో పడతాడు. క్యాన్సర్ కారణంగా కొద్ది రోజుల్లో చనిపోబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాకు ఓ కుదుపు. ఆ వత్తిడినుంచి బయటపడటానికి నేచర్‌ని వెతుక్కుంటూ ఊటీ వెళ్తాడు. అక్కడ అల్లరిపిల్ల గీతాంజలి (గిరిజ) పరిచయం. ఇలా ఒకరినొకరు అల్లరి పెట్టుకుంటూ రొమాంటిక్‌గా సాఫీగా సాగిపోతుంది సినిమా. చివరికి ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అప్పుడు తెలుస్తుంది, గిరిజ కూడా చావుకు దగ్గరగా ఉందని. మళ్లీ కుదుపు. వాళ్లిద్దరూ ఏమయ్యారు? ఇదీ కథ. ప్రేమికుల క్యాన్సర్, చావుల నేపథ్యంగా సాగే ప్రేమ కథ. దానికితోడు నేచర్ మూడ్. ఆ నేపథ్యంలో వచ్చే ‘ఆమని పాడవే కోయిలా’. మణి టేకింగ్, బాలు గాత్రం, ఇళయరాజా సంగీతం, వేటూరి పద పోహళింపు.. ఇంకేం కావాలి గొప్ప పాట పుట్టడానికి. అన్నీ అలా అమరి అద్భుతమైన పాటైంది. ఇష్టమైన పాటంటూనే ఏమీ చెప్పలేదనుకుంటున్నారా? ఇది చదివాక పాటను చదివేకంటే, వినడమే బెటర్. కళ్లుమూసుకుని ఒక్కసారి వినండి. అద్భుతం కనిపిస్తుంది.

ముగింపుగా చరణంలో చిన్న ముక్క:

వయస్సులో వసంతమె/ ఉషస్సులా జ్వలించెనే
మనస్సులో నిరాశలే/ రచించెలే మరీచిక..
ఎంత గొప్ప పదాలండి. అందుకే.. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.

-వి యశ్వంత్, సికింద్రాబాద్