Others
చిరంజీవి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 October 2018
--గరిమెళ్ల నాగేశ్వరరావు 9951573053
దేహాన్ని దేశాన్ని రాసిచ్చేసి
రాలిపోయిన వాడి పేరు
రాత్రిపూటైనా తలుచుకో!
రక్తాని దారిపొడవునా దానం చేసూత
కనుమూసిన వాడి కథను
కడవరకు గానం చేసుకో!
చెమటతో కాలాన్ని కలిపి
పొట్టకి పట్టెడన్నమై
రొట్టి లా కాలినవాడిని
గట్టిగా హత్తుకో!
రాత్రికీ పగటికీ మధ్యన
యంత్రమై తిరుగుతూ
లోకాన్ని మెరిపించి
ఆరిపోయిన వాడి గుర్తుగా
ఓ దీపాన్ని వెలిగించు
సరదాల పరదాల వెనుక
చెమట చిందే చేతులుంటాయి
కరచాలనం చేసుకో..
సాగే నడకల కింద
నలిగిన పాదాల గుర్తులకి
నమస్కారం చేసుకో!
చిత్తరువులోంచి
చిరునవ్వు రువ్వేవాడు కాదు
చరితలో చైతన్యమై నిలిచేవాడే
నిజమైన చిరంజీవి!