Others

డైరెక్టర్స్ ఛాయిస్..ప్రయోగాత్మక ప్రయత్నం .

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు భానుశంకర్
సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపడానికి కొందరు కమర్షియల్ పంథా అనుసరిస్తే.. ఇంకొందరు
ప్రయోగాత్మక ఆలోచనలతో ప్రేక్షకుడి ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు
భానుశంకర్ రూపొందించిన అర్ధనారి. హిజ్రాతో సమాజంలో జరిగే
అన్యాయాలపై కొరడా ఝుళిపించాడు. ఈ సందర్భంలో
భానుశంకర్‌తో చిట్‌చాట్‌ప్రయోగం, ప్రయత్నం
మరీ పీక్స్‌లో ఉన్నట్టుంది?
అర్ధనారి అంటే సగం ఆడ అని అర్థం. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా.

ఇలాంటి కథ కొత్తవాళ్లతో
చేస్తే రిస్క్ కాదా?
నిజానికి పెద్ద హీరోతో చేయాలనే చాలామంది హీరోలను అప్రోచ్ అయ్యా. కానీ ఎవరూ ముందుకు రాలేదు. హిజ్రా పాత్రలో ప్రయోగం చేయడానికి హీరోలు నిరాకరించారు.

తెలుగులో ఇలాంటివి ఫలిస్తాయా?
తెలుగు సినిమా అనగానే ఎంటర్‌టైన్‌మెంట్ అంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ ఒక్కటేనా? కొంతమంది కమెడియన్స్‌ను పెట్టి ఇలాంటి సినిమా చేయలేం. అలాంటి ఆలోచన పోతేనే మంచి ప్రయోగాలు వస్తాయి.

హిజ్రా పాత్ర చేసిందెవరు?
ఈ సినిమాలో హిజ్రా పాత్ర లేదు. హిజ్రా పాత్రలో హీరో కనిపిస్తాడు. వైజాగ్‌కి చెందిన అర్జున్‌ని ఆడిషన్ చేసి హీరోగా ఎంపిక చేశాం. కచ్చితంగా కమల్, రజనీలస్థాయి నటుడు.

మరి నెక్స్ట్ ప్రయోగం?
ఈ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కొత్త కథలైతే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంకా ఎవరితోనూ చర్చలు జరపలేదు.

-శ్రీ