Others

పున్నమినాగు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైరా చిత్రంతో బిజీగావున్న చిరంజీవి ఇప్పటికి 150 సినిమాలు దాటాడు. కానీ ఆయన కెరీర్‌లో గొప్ప సినిమాలంటూ ఎంచితే -సగం కూడా ఉండకపోవచ్చు. వాటిలో మంచి సినిమాలను ఏరుకుంటే -వేళ్లపైనే దొరకొచ్చు. అలాంటివాటిలో -పున్నమినాగు సినిమా కచ్చితంగా ఉంటుంది. చిరు సినిమా కెరీర్‌కు పున్నమినాగు -ఓ పెద్ద మలుపు. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. చిత్రంలో నర్సింహరాజుతో స్క్రీన్ షేర్ చేసుకున్నా -విలనిజం షేడ్స్‌తో చేసిన హీరో పాత్ర చిరంజీవిదే. కుక్క, ఏనుగు, పాము.. ఇలా ఏదోక మూగజీవిని తీసుకుని, వాటికి మానవ స్వభావాన్నో, మానవాతీత శక్తులనో ఆపాదించి సినిమాలు తీయడం ఏవీఎం నిర్మాణ సంస్థకే చెల్లింది. అలా ఈ చిత్రం కూడా ఏవీఎం బ్యానర్‌పై వచ్చిందే. హీరోగా ఎదుగుతున్న తొలినాళ్లలో చిరంజీవి నటన ఎంత స్వాభావికంగా ఉండేదో ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. రామనారాయణ రాసిన కథలోని గొప్పతనం, దాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు రాజశేఖర్ చూపిన ప్రతిభ అద్భుతమనే చెప్పాలి. నిజానికి ‘హున్నిమేయ రాత్రియల్లి’ అనే కన్నడ చిత్రానికి రీమేక్‌గా పున్నమినాగు నిర్మించారు. ఈ చిత్రంలో రతి అగ్నిహోత్రి లీడ్‌రోల్ పోషించింది. పాములు పట్టుకునేవాడింట నాగులు (చిరంజీవి) పుడతాడు. ఏనాటికైనా పగబట్టిన పాము కారణంగా తన కొడుకు మృత్యువాతపడతాడన్న భయంతో -ఆ ప్రమాదంనుంచి తప్పించేందుకు చిన్నప్పటి నుంచీ కొంచెం కొంచెంగా విషాన్ని ఆహారంలో ఇస్తాడు తండ్రి. అలా పెరిగి పెద్దవాడైన నాగులుకు -నాగుపాము స్వభావం వచ్చేసింది. విషప్రాణిలా తయారవుతాడు. ప్రతి పున్నమిరాత్రిలోనూ నాగుపాములా వ్యవహరించే నాగులు పరిస్థితి ఏమైందన్నది? అసలు కథ. హాలీవుడ్‌ను తలదనే్న కథతో నడిచే సినిమా -ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. పాము కళ్లలో కోపం, పొరవదలడం లాంటి నాగుపాము లక్షణాలను ప్రదర్శించే సన్నివేశాల్లో చిరంజీవి నటన అద్భుతం. అంతేకాదు, తన పరిస్థితిపై తనే కోపాన్ని ప్రదర్శించి, తనను తనే అసహించుకునే సందర్భంలో కోపం, వేదన, అత్యన్యూనతలాంటి స్వభావాలను అత్యద్భుతంగా ప్రదర్శించాడు చిరంజీవి. క్రమక్రమంగా కమర్షియల్ ఫార్మాట్‌లో ఇరుక్కుపోయిన చిరు, పెద్ద చిత్రాల హీరోగా ఎదిగినా ఆనాటి స్వాభావికమైన నటన ఇప్పటి చిత్రాల్లో కనిపించడం లేదన్నది నిజం. చిరు అద్భుత నటనకు అద్దంపట్టే పున్నమినాగు చిత్రాన్ని కాదనేవారు ఉండరేమో.

-ప్రసన్న, పాలకొల్లు