Others

ఆర్థిక ప్రణాళిక అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి మహిళలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్ళపై నిలబడాలనుకుంటారు. అలాంటి మహిళలు ఆర్థికంగా ఎలాంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి? ఆత్మస్థైర్యంగా ముందుకు ఎలా సాగాలో చూద్దాం..!
రిటైర్మెంట్ ఫండ్స్ సమకూర్చుకోవడానికి పురుషులతో పోలిస్తే మహిళలు రెండింతలు ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకు కారణాలు ఏంటంటే..
మాన్‌స్టర్ సాలరీ ఇండెక్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో మహిళల ఆదాయం పురుషులతో పోలిస్తే దాదాపు ఇరవై శాతం తక్కువ. భర్త భరోసా ఉన్న మహిళలతో పోలిస్తే ఒంటరి మహిళలకు సేవింగ్స్ మరింత ముఖ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏడున్నర కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారిలో పెళ్లికాని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు లేదా ఇతర కారణాల వల్ల జీవిత భాగస్వాములకు దూరంగా ఉంటున్నవారున్నారు. భారతదేశంలో పురుషుల సగటు ఆయుష్షు 66.9 అయితే, మహిళల సగటు ఆయుష్షు 69.9 సంవత్సరాలు. భారతదేశంలో చాలామంది మహిళలు తమ జీవిత భాగస్వాములపైనే ఆర్థికంగా ఆధారపడతారు. వీరంతా తమ ఆర్థిక ప్రణాళికలను తామే రూపొందించుకోవాలి.
ఆర్థిక నిపుణులు చెబుతున్న దానిప్రకారం మహిళలు ఎక్కువ డబ్బు పొదుపు చేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం, ఉద్యోగాల్లో చేరే ముందే జీతాలకు సంబంధించిన విషయాలను స్పష్టంగా చర్చించడం, ఎంత వీలైతే అంత కాలం వృత్తిలో కొనసాగడం, సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. ఇంట్లో ఉండే మహిళలు తాము దాచుకున్న డబ్బును సిస్టమాటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ వంటి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. మహిళలు అధిక లాభాలు పొందేందుకు, ఎక్కువ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కస్టమైజ్డ్ అకౌంట్లు ఓపెన్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే కాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్స్ వంటి అవకాశాలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్, ఎన్నో బీమా కంపెనీలు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బీమా పాలసీ ప్రీమియంలో ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనికి ముఖ్యకారణం మహిళల సగటు ఆయుష్షు పురుషుల కంటే ఎక్కువ ఉండడం. అంతేకాదు ఇంకా ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లు కూడా మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి. 2018 బడ్జెట్‌లో మహిళల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను ఎనిమిది శాతం చేసింది ప్రభుత్వం. మహిళలు ఉద్యోగం చేస్తున్న కంపెనీలు పనె్నండు శాతం. ఈపీఎఫ్ జమ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగంలో చేరిన మొదటి మూడు సంవత్సరాలు మాత్రమే ఇది అమలులో ఉంటుంది. ఇలాంటివన్నీ ఉపయోగించుకుంటే మహిళలు అవసరమైతే వృద్ధాప్యంలో కూడా ఎవరిపైనా ఆధారపడకుండా జీవించవచ్చు.