AADIVAVRAM - Others

పరీక్షలకు సంసిద్ధత ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల కాలం వచ్చేస్తోంది. ఇటీవల ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 28 నుండి పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ బోర్డ్ సన్నద్ధమవుతోంది. విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చని ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
ఒత్తిడికి కారణం
ళ్ఘూ (్భయం) పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులలో భయం ఏర్పడుతుంది. ఆశించిన మార్కులు సాధిస్తానా.. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉపాధ్యాయులు ఏమంటారోననే భయం కలుగుతుంది. ముందుగా భయాన్ని వీడాలి.
శనజళఆక (ఆందోళన) నేను చదివిన పాఠ్యాంశాలలోని ప్రశ్నలు వస్తాయో లేదో.. వచ్చినా వాటికి సరైన సమాధానాలు పూర్తి స్థాయిలో రాయగలనో లేదో.. నేను చదవని పాఠాల్లోనివి వస్తే ఏం చేయాలి? తదితరాలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. ఏకాగ్రత తగ్గుతుంది. ఏది వచ్చినా రాయగలమనే ధీమా నమ్మకంతో ఉంటే ఆందోళనను దూరం చేసుకోవచ్చు.
ళశఒజ్యశ (ఉద్రిక్తత) పరీక్షల్లో ఎన్ని మార్కులు తెచ్చుకొనే స్థాయి ఉందో నా గురించి నాకు తెలుసు కానీ ఎక్కువ శాతం మార్కులు తెచ్చుకోవాలనే తపన. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ వల్లే ఉద్రిక్తత పుడుతుంది. దీని నుంచి బయటపడాలంటే విద్యార్థులు తమ సామర్థ్యంపై సొంత నిర్ణయంపై లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి.
స్ఫూర్తిగా తీసుకోవాలి, స్ఫూర్తిగా నిలవాలి
విజేతలను ప్రేరణగా తీసుకోవాలి..
120 కోట్లపైచిలుకు గల జనాభాలో.. కొందరు మాత్రమే సింధూ, సాక్షి మాలిక్, పూర్ణ, నర్సమ్మలు.. దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో వారు పడిన శ్రమ మనకు శిరోధార్యం కావాలి. సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లక్ష్య సాధనలో అడ్డంకిగా మారినప్పటికీ లక్ష్యాన్ని సులభంగా సాధించిన వారు ఎందరో ఉన్నారు.
ఒక దేశంలోని పక్షులు తమ ప్రాంతంలో మనుగడ సాధించలేని వాతావరణ పరిస్థితులు ఉంటే అవి తాగడానికి నీటి కోసం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. జీవితాన్ని కొనసాగించడంపై వాటికే అంత తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని శాసించే స్థాయిగల అధిక మేధస్సు ఉన్న మనుషులు మాత్రం నిరాశా నిస్పృహలకు లోనవుతూ తమ జీవితాన్ని భూమికి భారంగా వెళ్లదీసే వారెందరో ఉన్నారు. జీవన పోరాటంలో విజయాలు, వైఫల్యాలు సహజం. వైఫల్యాల నుండి కూడా నేర్చుకుని లక్ష్యాన్ని సాధించిన థామస్ అల్వా ఎడిసన్ ఆదర్శం. ఉన్నతంగా ఆలోచించండి ఉన్నత లక్ష్యాలను చేరువగా చేసుకోవాలి.
ప్రేరణ చేసుకునే పద్ధతులలో ప్రముఖమైన పద్ధతి ప్రొ.ఒట్టెంజెన్స్ తెలిపారు.
అదే జ్జ్జీ- పద్ధతి.
జీ జీజఒ్ద కావాలని కోరుకోవడం (లక్ష్యం) మనం ఏదైతే కావాలని మన మనసులో బలమైన కోరిక కలిగి ఉంటామో దానిపై స్పష్టతను ఏర్పరచుకోవాలి. రోజుకొకసారి మనః ఫలకంపై గుర్తుకు తెచ్చుకోవాలి.
జజఖఆష్యౄళ (్ఫలితం) మన మనసులో ముద్రితమై ఉన్న లక్ష్యం సాధిస్తే రాబోయే ఫలితాన్ని విజువలైజ్ చేసుకోవడం. దాని ఫలితాన్ని నెమరువేసుకోవాలి.
జజఇఒఆ్ఘషళ (అడ్డంకులు) - లక్ష్య సాధన ప్రయత్నంలో రాబోయే అడ్డంకులను ముందుగానే పసిగట్టడం. అంచనా వేయడం వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.
- -్ఘశ (ప్రణాళిక) - మన బలాలు, బలహీనతలను దృష్టిలో పెటుటకుని మనం ఏమి కావాలో, ఏ విధంగా చేరుకోవాలో, ఎంత సమయం పడుతుందో ముందస్తు ప్రణాళిక తయారుచేసుకోవాలి.
పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధపడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏది ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావల్సింది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల.
స్టీఫెన్ హాకింగ్: స్టీఫెన్ తన 17వ ఏట ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో మోటార్ న్యూరాన్ వ్యాధి రావడంతో 3 సంవత్సరాలలో తన అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోయి మరణిస్తాడని డాక్టర్లు ధృవీకరించారు. కానీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆత్మవిశ్వాసంతో ప్రపంచానికి బ్లాక్‌హోల్ లాంటి ఎన్నో పరిశోధనలు అందించిన వ్యక్తి.
అరుణిమా సిన్హా: అరుణిమా సిన్హా రైలు ప్రమాదంలో పూర్తిగా ఛిద్రమైన శరీరం, ఒంటికాలితో కేవలం రెండు సంవత్సరాలలోపు ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో సాధన చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారత మహిళ.
లక్ష్య నిర్ధారణలో శాస్ర్తియ పద్ధతి డ్గ
డడఔళషజచిజష (స్పష్టత) మనం నిర్ధారించుకున్న లక్ష్యం స్పష్టతను కలిగి ఉండాలి. దీని కోసం నా శక్తి సామర్థ్యాలను, నాకున్న సమయంలో కొనసాగిస్తాను అని నిర్ణయం తీసుకోవాలి.
యఆజ్ప్ఘఆజ్యశ (ప్రేరణ) - లక్ష్యం నిరంతరం ప్రేరణ నివ్వాలి. లక్ష్యం సిద్ధిస్తే వచ్చే లాభాలు, ఆనందాన్ని గుర్తించాలి. అప్పుడు లక్ష్య సాధనలో దూసుకు పోగలుగుతాం.
ష్దజళ్ప్ఘఇళ (సాధించగల) - మానసిక శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక పనిని సాధిస్తే ఆ పనిని అందరూ సాధించగలిగే శక్తిని ఈ ప్రకృతి మనిషికి ప్రసాదించింది. కాబట్టి లక్ష్యాన్ని సాధించగలిగే శక్తి నీకున్నదనే సత్యాన్ని గ్రహించడం అయితే సాధించే క్రమంలో అంశాలను నేర్చుకొనే పద్ధతుల్లో ప్రతి మనిషికి మధ్య తేడాలు ఉంటాయి. కొందరు తొందరగా సాధిస్తారు కొందరికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు.
గ గళ్ఘజఒఆజష (వాస్తవికం) - తమ శక్తిసామర్థ్యాలు, ఉపయోగించే పద్ధతులు, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవికతతో రోజువారీ సాధనను కొనసాగించాలి.
జౄళ ఱ్యఖశజూ (సమయం ప్రకారం) - ఏ లక్ష్యానికైనా సమయం ఎంత తీసుకుంటుందో నిర్ణయించుకోవాలి. శాశ్వత లక్ష్య సాధనకు సమయానికి అనుగుణంగా తాత్కాలిక లక్ష్యాలను నిర్ధారించుకుని ఇంత సమయంలో పూర్తి చేస్తాను అని నిబంధన పెట్టుకొని పని చేయడం వల్ల ఎలాగైనా పూర్తి చేయాలనే తలంపు రెట్టింపు అవుతుంది.
ళనజఇళ (మార్చుకోవడానికి వీలుగా) - తాత్కాలిక లక్ష్యాలను చేరుకునే వేగాన్నిబట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి టార్గెట్స్‌ను పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న అడ్డంకులను బేరీజు వేసుకుంటూ వాటికి లొంగకుండా తమ శక్తిసామర్థ్యాలను సమీకరించుకుంటూ లక్ష్యసాధన దిశగా ప్రయత్నాలను కొనసాగించాలి.
లక్ష్యసాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధనలో మిత్రులతో చర్చించడం,మేధావులు, విజేతల సహకారం తీసుకోవడం, సీనియర్స్ సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే మీ లక్ష్యం మీకు దాసోహం అవుతుంది.
నీ వెనుక ఏముంది.. ముందేముంది.. అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. నీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు మనమూ సాధిద్దాం. ఇతరులకూ స్ఫూర్తినిద్దాం.

-డా.అట్ల శ్రీనివాస్‌రెడ్డి