Others

మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల క్షణకాలమైనా
కలకాలం వెంటాడే
భయాలుంటాయి
ఆందోళనలుంటాయి

కల క్షణకాలమైనా
కలతలుంటాయి
కన్నీళ్లుంటాయి
కల్లోలాలుంటాయి

కల క్షణకాలమైనా
కష్టాలుంటాయి
కఠిన పరీక్షలూ ఉంటాయి
మరోవైపు

కల క్షణకాలమైనా
వీరత్వం శూరత్వం
ధీరత్వం విరామమెరుగక
పరుగు పెడుతుంటాయి

కల క్షణకాలమైనా
మురిపాలుంటాయి
అంతులేని ఆంక్షలుంటాయి
కల నిజం కాదు
నిజం కలలో రాదు
కలేదో నిజమేదో
తెలియనంత వేగం
జీవితంలో ప్రతిక్షణం
కళ్లకు కడుతున్నా
నిజం వైపు నిస్సందేహాంగా
మనిషి మొగ్గు!

- డా॥ కొల్లు రంగారావు