Others

మేలుకొలుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం ముగియడానికి క్షణికమైన తప్పొకటి చాలు
విచ్చలవిడిగా చేతుల్లో విజ్ఞానం
విధ్వంసమైతే
బతుకులు వెలివేయబడతాయి

అరక్షిత మార్గాల్లో సుఖాన్ని వెతుకుతూ దుఃఖపడిపోతూ
చావు అంచులకి దరిదాపుల్లో
అచ్చం ఆరిపోయే దీపంలా

వొకరికి వాడిన సూది
వందల నరాల్లో గుచ్చబడితే
వైరస్ విశ్వాన్ని కబళిస్తుంది

తల్లి నుంచి వారసత్వంగా
జబ్బునే బహుమతిగా
రేపటి తరం పొత్తిళ్లలోనే
కనుమూస్తుంది

పెద్దదిక్కు ఎయిడ్స్ భూతానికి ఆహారమైతే
కుటుంబం అంతా సామాజిక వెలివేతనే..
ఆరోగ్య స్పృహని ప్రజల్లో
మేలుకొల్పినప్పుడే
ఎయిడ్స్‌ని నిలువరించగలము

మందులేని మహమ్మారికి
నివారణ వొక్కటే మార్గం
వాళ్లని మన నుంచి వేరు చేయకండి
ప్రేమతో వారి జీవితాన్ని
ఇంకాస్త పొడిగిద్దాం
మనమూ మనుషులమని
నిరూపిద్దాం..

-పుష్యమీ సాగర్ 90103 50317