Others

అంకుశం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రాజశేఖర్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం -అంకుశం. ఇంచుమించు 30 ఏళ్ల క్రితంవచ్చిన ఈ సినిమా -నా జీవితాన్ని ప్రభావితం చేసిన సినిమాల్లో ఒకటని చెప్పాలి. అంకుశంలో రాజశేఖర్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉదాత్తత -నన్ను ఆ డిపార్ట్‌మెంట్‌కు నడిపించకపోయినా ప్రభుత్వ సర్వీసులో నిలిపేలా చేసిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించను. అందుకే -ఈ సినిమా నాకు చాలా ఇష్టం. విధి నిర్వహణలో చిత్తశుద్ధి, అన్యాయాన్ని ఏమాత్రం సహించలేని ఉన్నతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ అద్భుతంగా నటించారు. దర్శకుడు కోడి రామకృష్ణ ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు గొప్పగా ఉంటుంది. ప్రస్తుత సామాజిక వాతావరణంలో అలాంటి పోలీస్ ఆఫీసర్ల అవసరం చాలా ఉందని అనిపిస్తుంటుంది -పత్రికల్లో వస్తున్న కొన్ని కథనాలు చదువుతుంటే. నిజ జీవితంలో అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన అధికారులు ఉంటారనే నమ్ముతున్నా.
ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే -నిజ జీవితంలో దంపతులైన రాజశేఖర్, జీవితలు చిత్రంలో లీడ్ రోల్స్. విలన్‌గా నటించిన రామిడిరెడ్డి ఈ సినిమాతో అంకుశం రామిరెడ్డి అయిపోయారు. రామిరెడ్డి ఆహార్యానికి తగినట్టు విలన్ పాత్ర బలమైనది కావడంతో -హీరో రాజశేఖర్ పోలీస్ పాత్రకు మరింత ప్రాధాన్యత చేకూరింది. ఎంఎస్ రెడ్డి (మల్లెమాల) పోషించిన రాజకీయ పాత్ర (ముఖ్యమంత్రి), తరువాతి తరాలకు రాజకీయాలపై సదభిప్రాయం కలిగించేదిగా ఉండటం మరో విశేషం. పొలిటీషియన్స్‌ను క్రిమినల్స్‌గా చూపించే ధోరణి సినిమాల్లో నడుస్తున్న టైంలో -ఓ గొప్ప ముఖ్యమంత్రి పాత్రను దర్శకుడు కోడి అద్భుతంగా రూపొందించి సినిమా సక్సెస్‌కు కారణమయ్యారు. ఈ సినిమా గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన వాళ్లలో -చెళ్లపిళ్ల సంత్యం (సంగీతం), కెఎస్ హరి (సినిమాటోగ్రఫీ), కెఎ మార్తాండ్ (ఎడిటింగ్) కచ్చితంగా ఉంటారు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుపాను సృష్టించిన అంకుశం సినిమాను -ఇప్పటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చూస్తే మస్కిష్కంలో ఆలోచనల సునామీ రేకెత్తకపోదు. రామ్‌గోపాల్‌వర్మ శివ, కోడి రామకృష్ణ అంకుశం చిత్రాలు నాపై ప్రభావం చూపించి, నన్ను పరిశ్రమకు లాక్కొచ్చాయని దర్శకుడు శీను వైట్ల అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఇక్కడ ప్రస్తావనార్హం. అంకుశం చిత్రం అప్పట్లో చాలా జీవితాలపై ప్రభావం చూపించిందన్నది నిజం. అందుకే ఆ చిత్రం నాకు చాలా ఇష్టం.

-వి రామాంజనేయులు, తుని