Others

ఎక్కడుందో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై నవరసాలు పండించి -మేటి నటి అనిపించుకున్న సావిత్రికి సరిజోడిని ఇప్పటి ఇండస్ట్రీలో ఊహించగలమా? తెలుగు సినిమా స్వర్ణయుగంలో ధ్రువతారగా వెలుగొందిన ఆమె జీవిత కథను సినిమా తీస్తే -ఆ పాత్రను పోషించగల ప్రతిభావంతురాలు ప్రస్తుత చిత్ర పరిశ్రమలో దొరుకుతుందన్న నమ్మకం కలుగుతుందా? సావిత్రి పోషించిన పాత్రలు, ఆ పాత్రల్లో ఆమె ఇమిడిపోయిన తీరు -తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోడు. మరి అలాంటి గొప్ప పాత్రలు పోషించిన సావిత్రి జీవిత కథను తెరకెక్కిస్తే -ఆ పాత్రను పోషించగల గొప్ప నటీమణులు ఎవరున్నారు? ఈ ప్రశ్న దగ్గరే సావిత్రి జీవిత కథను తెరకెక్కించాలనుకుంటున్న నాగ అశ్విన్‌నూ వెంటాడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సావిత్రి జీవిత కథకు సరైన పాత్రధారణి అనుష్కేనంటూ అనేకమంది సూచించినా, కరెక్టేనంటూ గట్టిగా ఒప్పుకోలేని పరిస్థితి. అలాగని ఆడిషన్స్ నిర్వహించి సావిత్రి పాత్రను పోషించే సత్తావున్న నటిని ఎంపిక చేసుకోవడానికి దర్శకుడు నాగ అశ్విన్ సిద్ధంగా లేడని తెలుస్తోంది. సావిత్రిలా కళ్లతో మాట్లాడగల, చిర్నవ్వుతో సంభాషణలు చెప్పగల, చిన్నచిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సన్నివేశాన్ని పండించగల సత్తావున్న నటీమణిని ఎంపిక చేయడానికి -ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ఆలోచనలో నాగ అశ్విన్ ఉన్నాడన్నది ఇండస్ట్రీ టాక్. మొత్తంగా తేలేదేమంటే -మహానటి సావిత్రి కథను తెరకెక్కించే ప్రయత్నాలైతే గట్టిగానే జరుగుతున్నాయి. కానీ, ఆమెనే చూస్తున్న భావన కలిగించేంతగా తన నటనతో మరిపించగల నటి ఎవరు దొరుకుతారన్నదే అసలు ప్రశ్న.