Others

సంపాదన బావుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుంటూరు టాకీస్’ తర్వాత జబర్దస్త్ భామ ‘రేష్మీగౌతమ్’ నటించిన సినిమా ‘అంతం’. రంజాన్ సందర్భంగా గురువారంవిడుదలైన సినిమా బాగానే నడుస్తోందని టాక్. జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతం సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయన్నది డిస్ట్రిబ్యూటర్స్ టాక్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 300 స్క్రీన్లపై సినిమాను రిలీజ్ చేశారు. తొలిరోజు దాదాపు రూ.1 కోటి గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఒక చిన్న సినిమాకు తొలిరోజు ఇంత గ్రాస్ రావడం నిజంగా గ్రేట్ అంటున్నారు. అయతే, దీనికి అంతటికీ కారణం ‘రేష్మీ గౌతమ్’ గ్లామరేనని ఇండస్ట్రీ గట్టిగానే చెప్పుకుంటోంది. ‘గుంటూరు టాకీస్’లో రెచ్చిపోయి అందాలు చూపించిన రేష్మి, ‘అంతం’లో చెలరేగిపోతూనే, మంచి క్రేజ్ తెచ్చుకుంది. రేష్మీ క్రేజ్ చూసే నిర్మాతలు కూడా సినిమా పోస్టర్లలో ఆమెనే హైలెట్ చేశారు. ‘గుంటూరు టాకీస్’లో రేష్మీ అందాలకు ఫిదా అయిన కుర్రకారు ఈమెని బాగానే ఫాలో అవుతున్నారట. అందుకే ఈ జబర్దస్త్ హాట్‌భామ ఇప్పుడు నాలుగు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు, రెమ్యునరేషన్ రెండింతలు చేసేసిందట. అసలు ఎంత? అన్నది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు.