Others

పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగు ఎటుచూసినా పరుగు
ఎవరిని పలకరించినా పరుగు
బదులివ్వని పరుగు ఒకటే పరుగు
అవకాశాల కోసం ఆరాటం
అడుగడుగునా అవకాశవాదం
అధికారానికి పరుగు
ఆత్మీయతలు కనుమరుగు
నిదానమే ప్రదానం ఒకప్పటిమాట
పరుగో పరుగు నేటి మేటి మాట!

రోతనుకున్నది నీతై
నీతిని నిందించడంలో పరుగు
నీతికి అవినీతికి మధ్య
అంతులేని అగాధంలోనూ పరుగు
అహంకారంతో కూడిన పరుగు
ఆదరణలో అడుగడుగునా తరుగు!

వాగుడుకి మాట్లాడటానికి
తేడాలు తెలీని వారి మధ్య
వినడానికి అనడానికి
అంతరమెరుగని వారి మధ్య
నీ ఇంటికి నేనొచ్చినా
నా ఇంటికే నువ్వొచ్చినా
ఏదో ఒకటి కాదు..
నాకు నచ్చిందే.. నువ్వే ఇవ్వాలని

ఆశించే తీరైనా శాసించే జోరైనా
మంచీ మర్యాదలనెలా పెంచుతుంది?
మనసులోతుల్లో మమతలు
మమకారాలనెలా పూయిస్తుంది..?

- డా॥ కొల్లు రంగారావు