Others

పిల్లల చదువులో పెద్దల పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. కానీ సామాజిక మార్పులు, ఆలోచనావిధానం వంటి పలు మార్పుల మూలంగా ఇప్పటి తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో సమయంతో బాటు తగినంత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పిల్లల చదువుల విషయంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నేటి పెద్దలూ మారాల్సిన సందర్భమిది.
గుర్తించాల్సినవి..
* పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించటంతో పాటు అందుకు తగిన వాతావరణాన్ని ఇంట్లో పెద్దలు ఉండేలా చూసుకోవాలి. చేతివేళ్లలా ఏ ఇద్దరు పిల్లల గ్రహణ శక్తులూ ఒకేలా ఉండవనీ పెద్దలు గుర్తించాలి.
* కష్టమైన హోం వర్క్‌లో తగినంత సాయం పెద్దలు చేయాల్సిందే.. అయితే అన్నింటా జోక్యం చేసుకోరాదు. దీనివల్ల పిల్లలు పెద్దలపై అతిగా ఆధారపడి వారు లేకుండా ఏ పనీ చేయలేకపోతారు.
* పిల్లల చదువు విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను తల్లిదండ్రులు ఆశించిక వాస్తవిక దృష్టితో వ్యవహరించాలి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు పిల్లల కోణం నుంచీ ఆలోచించే ప్రయత్నం చేయాలి.
* పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోకజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయటం, కొత్త ప్రదేశాలకు తీసుకువెళితే వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను కలిసి పిల్లలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా పిల్లల విషయంలో వీరికున్న అపోహలు తొలగిపోతాయి.
* పిల్లలు చదువులో ప్రతిభ చూపినప్పుడు పెద్దలు దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడే తమ శక్తిసామర్థ్యాలపై మరింత గురి కుదురుతుంది. చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి కించబరచకూడదు. దీనికి బదులు సానుకూల సలహాలివ్వటం, ప్రోత్సహించడం అవసరం.
* చదువుతో పాటు ఆటపాటలుంటేనే వారు మంచి ఆరోగ్యాన్ని పొందగలరు కనుక పిల్లలు రోజూ కొంత సమయం ఆటలు, వ్యాయామాలకు కేటాయించేలా చూడాలి.
* కంటిచూపు లోపాలు, బుద్ధిమాంద్యం వంటి జన్మతః వచ్చే కొన్ని సమస్యల కారణంగా పిల్లలు చదువులో వెనుకబడొచ్చు. ఇలాంటి సమస్యలుంటే ముందుగానే గుర్తించి చికిత్స చేయించాలి.
* పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్థమయ్యే భాషలో వివరించి వారిని సంతృప్తిపరచాలి తప్ప వారిని విసుక్కోరాదు. దీనివల్ల పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి.
* పిల్లలు ఒక సబ్జెక్టులో వెనుకబడటానికి కారణాలు అవగాహన చేసుకుని, ఇంట్లో బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా పెద్దలు శిక్షణనివ్వాలి. దీనివల్ల పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ఉంటారు.