AADIVAVRAM - Others

వేణుగాన మాధుర్యం.. మది నిండా ఆనందం (రాస క్రీడాతత్త్వము)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ జీవులు తమకు క్రొత్తగా అనుభవానికి వస్తున్న ఈ దశ ఏమిటా-అని ఆలోచించుకునే లోపలే, వారి మనసులు వారి వశం తప్పిపోతున్నాయి.
(i) కొందరు ఆ సమయానికి ఇంకా గొడ్లకు పాలు పితుకుతున్నారు.
(ii) కొందరు పాలముంత పొయ్యి మీద పెట్టబోతున్నారు.
(iii) కొందరు పొయ్యి మీద అన్నం కలియ బెట్టబోతున్నారు.
(iv) కొందరు వడ్డిస్తున్నారు.
v) కొందరు పిల్లలకు పాలిస్తున్నారు.
vi) కొందరు భర్తలతో సరసాలాడుతున్నారు.
(vii) కొందరు అన్నం తింటున్నారు.
viii) కొందరు స్నానం చేస్తున్నారు.
ix) కొందరు అలంకరించుకుంటున్నారు.
(x కొందరు ఇళ్ళు సర్దుకుంటున్నారు.
వేణునాదాల వెల్లువకు వారంతా ఎక్కడివారక్కడే నిశే్చష్టులైపోయారు. ఏ పనీ జరగడంలేదు. ఏ ఆలోచనా తోచడం లేదు. ఏమి జరుగుతోందో తెలియటం లేదు.
అయితే చిత్రమేమంటే - పొయ్యిమీది పాలు పొంగిపోతున్నా, కుండలో అన్నం మాడిపోతున్నా, తల్లి పాలివ్వడం ఆపేసినా, సరసాలాడే భార్య మొద్దు నిద్దరలో పడిపోయినా, ఇళ్ళు చక్కదిద్దే కోడలు ఆవలించి గోడలకు వాలి, గుమ్మం దగ్గరే కునుకుదీసినా, భర్తలు గానీ, మామలు గానీ, పిల్లలు గానీ, ఏ ఒక్కరూ కోపగించుకోవడం లేదు. ఎవరికి వారు వినిపించే వేణుగాన మాధుర్యానికి మెత్తబడిపోయి, హృదయాలన్నీ సౌజన్యంతో నిండిపోయి, ఒక విధమైన ఆనందంలో తేలిపోయి, ‘‘అయ్యో! అలసిపోయారు పాపం’’ అని అనుకొంటూ సద్దుకు పోతున్నారు. ‘‘మన్యమానాః స్వ పార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకనః’’ (స్కం10- అధ్యా33-శ్లో39) (తమ తమ ఆడవారంతా తమ ప్రక్కనే వున్నారని భావిస్తూ) - అని మూలం.
కొన్ని ఇళ్ళలో భర్తలో, సోదరులో, అత్తలో, కొడుకులో, వీరి పరిస్థితి చూసి, కంగారుపడి, వారెటూ కదలకుండా, మత్తులో పక్కకు జారిపోకుండా, కట్టుదిట్టాలు చేస్తున్నారు. అయినా సరే, ఆ గోపికల హృదయాలను గోవిందు డప్పటికే కొల్లగొట్టేశాడు. అందువల్ల వారి హృదయాలు వెనక్కు రాలేదు.
వారీ స్థితిలో వుండగానే, వారి సూక్ష్మశరీరాలు వాళ్ళ స్థూల శరీరాలనుంచీ వెలువడి, మరొకరి కోసం చూడకుండా, తోటి గోపికలతో కూడా సంప్రదించకుండా, పరమాత్మ కోసం పరుగులు తీశాయి.
కొందరు గోపికలకు తమ స్థూలశరీరాల్నుంచీ బయట కు వెళ్ళటం అంత సులభంగా సాధ్యం కాలేదు. ఈ దేహబంధాల్ని తెంచుకుని ఎలా బయటకు వెళ్ళాలో ఆ సమయంలో కంగారువల్ల వారికి అర్థం కాలేదు. అప్పుడు పూర్వజన్మ సంస్కారంవల్ల, వాళ్ళు కళ్ళు మూసుకుని, తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. ఆ దశలో ఉండగా దేహాలనుంచి ఎప్పుడు బయటపడ్డారో, ఎలా బయ టపడ్డారో, వారికి తెలియనే లేదు.
ఇక్కడ భాగవతంలోని మూల శ్లోకాలను తీసుకుని పరిశీలిస్తే గానీ, తత్త్వం సరిగా అర్థం కాదు.
అంతర్గృహగతాః కాశ్చిత్ గోప్యో-లబ్ధ వినిర్గమాః
కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలిత లోచనాః ॥
(్భగవతం-స్కంధం-10, అధ్యాయం-29, శ్లోకం-9)
(్భవం : కొందరు గోపికలు ఇంట్లో వుండి పోయి (అంతర్గృహ గతాః) బయటకు వచ్చే విధానం తెలియక, కృష్ణ్భావనలో పడిపోయి, కళ్ళు మూసుకుని, ఆ కృష్ణుణ్ణే ధ్యానం చేశారు.)
గమనిక : ఈ శ్లోకంలో అంతర్గృహగతాః అనే చోట అంతర్గృహం అనే పదానికి అంతరంగమనే అర్థం. దధ్యుః మీలితలోచనాః - అని ధ్యానాన్ని స్పష్టంగా చెబుతున్నారు.
దీని వెనకాల శ్లోకంలో కొందరు గోపికలను వారి భర్తలూ, తండ్రులూ మొదలైనవారు నివారించారు అని వుంది. (వార్యామాణాః.) ఇక్కడ నివారణ అంటే ‘‘ఆ గోపికలు ఇల్లు వదిలి పారిపోబోతున్నట్టు, బంధువు లడ్డుపడి కట్టిపడేసినట్టూ’’ మనం భావిస్తే, అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే-అదే శ్లోకంలో రెండవ భాగంలో ‘‘న న్యవర్తంత’’ (అడ్డం పెట్టినా ఆగలేదు) అని వుంది. ఇంట్లోని ఆడపిల్లలు పారిపోతుంటే, పెద్దవాళ్ళడ్డంపడ్డా కూడా ఆగకపోతే, ఈ సన్నివేశం ఒక ఇంట్లో గాక అనేక ఇండ్లలో జరిగితే, ఆ గ్రామమంతా అల్లకల్లోలమే అయి వుండాలి. కానీ, 33వ అధ్యాయం చివరలో, 39వ శ్లోకంలో, ఆ గ్రామాల్లోని మగవారెవరూ అసూయపడలేదనీ, వారి వారి ఆడవాళ్ళు వారి వారి ఇళ్ళలోనే వున్నట్టు భావించారనీ, వుంది. ఈ విషయాన్ని వెనుకటి చర్చలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకం చూద్దాం.
నాసూయన్ ఖలు కృష్ణాయ
మోహితా స్తస్య మాయయా ॥
మన్యమానాః స్వపార్శ్వస్థాన్
స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః ॥
(్భగవతం-స్కం10,అధ్యా-33,శ్లో-39)
(ఇంకా వుంది)

- కుప్పా వేంకట కృష్ణమూర్తి.. 9866330060