AADIVAVRAM - Others

కాఫీ వ్యర్థాలతో కదలాడే బస్సులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేంటి..? బస్సులు కాఫీలు తాగడమేంటి.. అనుకుంటున్నారా? మీకూ కాఫీ తాగే అలవాటుందా? అయితే.. కాలుష్యాన్ని తగ్గించడంలో మీరూ పాలుపంచుకున్నట్లే.. ఇదేంటి.. ఒకదానికి, మరోదానికి సంబంధం లేకుండా చెబుతున్నారు.. అనుకుంటున్నారు కదూ.. విషయమేమిటంటే.. లండన్లో త్వరలో కాఫీ వ్యర్థాలతో నడిచే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌తో కాకుండా కాఫీతో నడిచే బస్సులు వస్తున్నాయి. లండన్‌లోని బయోబీన్ అనే సంస్థ ఇలాంటి బస్సులను రూపొందిస్తోంది.
ప్రపంచ దేశాలన్నీ పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా బయటపడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి చేటు చేయని ఇంధనాల కోసం ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుగుతున్నాయి. బయోబీన్ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్థర్ కే కూడా ఇలాంటి ఆలోచనతోనే కాఫీ వ్యర్థాల నుంచి తయారయ్యే ఇంధనంతో నడిచేలా ఓ బస్సును రూపొందించాడు. కొద్దినెలల్లోనే ఇది లండన్ రోడ్లపై తిరగనుంది. బయోబీన్ సంస్థ కోస్టా కంపెనీ ప్రముఖ కాఫీ దుకాణాల నుంచి వాడేసిన కాఫీ గింజలను సేకరిస్తుంది. అలా సేకరించిన కాఫీ వ్యర్థాల నుంచి ద్రవ ఇంధనం తయారుచేస్తుంది. కాఫీ వ్యర్థాల్లో 15 నుంచి 20 శాతం ఇంధనం వస్తుంది. ఒక్క బ్రిటన్‌లోనే ప్రజలు ఏటా ఐదు లక్షల టన్నుల కాఫీ గింజలను వినియోగిస్తారు. దాని నుంచి వచ్చే వ్యర్థాలతో సుమారు ఐదు లక్షల మంది నివసించే ఒక నగరానికి విద్యుత్ సరఫరా చేయొచ్చని ఆర్థర్ కే అంటున్నారు.
జీవ ఇంధనాల వినియోగంలో స్వీడన్ చాలా ముందుంది. రాజధాని స్టాక్ హోంలో 15 వేల కార్లు, 300 బస్సులు జీవ ఇంధనాలతోనే నడుస్తున్నాయి. మొదట్లో ఇక్కడ చెరకు నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్ నుంచి జీవ ఇంధనాలను తయారుచేసేవారు. కానీ.. 1990 నుంచి వారు రూటు మార్చారు. మురుగు నుంచి మీథేన్‌ను ఉత్పత్తి చేసి దాన్ని బయోగ్యాస్‌గా వాడుతున్నారు. ఇప్పుడు ఆహార వ్యర్థాల నుంచి ఇంధనాలు తయారుచేసే దిశగా సాగుతున్నారు.
వ్యర్థాలతోనే..
నిజానికి తొలినాళ్లలో చెరకు మాదిరిగానే మొక్కజొన్న, పలు ఇతర పంటలను ఇథనాల్ తయారీకి వినియోగించినా అవి ఆహార పంటలు కావడంతో వాటిని ఇంధనానికి వాడడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు.. ఇంధనం కోసం పంటలు పండించాలంటే పెద్ద ఎత్తున భూమి అవసరమవుతుంది. దీంతో వాడేసిన కాఫీ గింజలు, కుళ్లిన కూరగాయల వంటి వ్యర్థాల నుంచి ఇంధనం తయారుచేయడంపై అంతా దృష్టి పెడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధనాల వినియోగం దిశగా ప్రపంచదేశాలన్నీ కదులుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే థర్మల్ పవర్ తగ్గుతూ సోలార్ పవర్ పెరుగుతోంది. విద్యుత్‌తో నడిచే వాహనాల వినియోగమూ ఎక్కువవుతోంది. వాటితో పాటు ఇలాంటి జీవ ఇంధనాలనూ వినియోగించడం వల్ల వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణానికీ మేలు చేసినట్లవుతుంది.

-మహి