AADIVAVRAM - Others

సేవాభావానికి ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరికం వల్ల తాను చదువుకోలేకపోయినా.. వందలాది మంది బీదపిల్లలకు ఆయన తన కష్టార్జితంతో విద్యాదానం చేస్తున్నాడు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతి పూర్తికాక ముందే సంపాదన బాట పట్టాడు.. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన ‘టీ’ దుకాణం నడుపుతూ సమాజం కోసం తనకు తోచినంత సేవచేస్తూ.. ఇపుడు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించాడు..
ఒడిశాలోని కటక్ నగరంలో ‘టీ’ దుకాణం నడిపే దేవరపల్లి ప్రకాశరావు(59) ఏటా 70 నుంచి 80 మంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. నాలుగు నుంచి తొమ్మిదేళ్ల లోపు పేదపిల్లలను చేరదీసి వారికి చదువుపై ఆసక్తి కలిగిస్తున్నాడు. 1976వ సంవత్సరం నుంచి రక్తదాన శిబిరాలకు చేదోడువాదోడుగా ఉంటూ సేవాభావాన్ని చాటుకొంటున్న ప్రకాశరావు అంతగా చదువుకోకపోయినా, అతనికి ఏడు భాషలపై అతనికి మంచి పట్టు ఉంది. దీంతో విభిన్న ప్రాంతాలకు చెందిన పేద పిల్లలను కలుసుకొంటూ వారిని బడిబాట పట్టిస్తున్నాడు. తనకు తెలిసిన విషయాలను చెబుతూ పిల్లలు చదువులో రాణించేలా ప్రోత్సాహం ఇస్తున్నాడు.
పేదపిల్లల చదువు కోసం ప్రకాశరావు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనను ఇటీవల ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపిక చేసింది. ‘టీ’ దుకాణంలో పనిచేసుకొంటున్న అతనికి ఓ రోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపిక చేసినట్లు దేశ రాజధాని నుంచి అధికారులు ఫోన్‌లో చెప్పడంతో ప్రకాశరావు ఉబ్బితబ్బిబ్బు కాలేదు. ‘ఇంతటి గొప్ప అవార్డులకు నాకు ఎలాంటి అర్హత లేదు.. నిజంగా ప్రజలు కోరుకొంటే అవార్డు స్వీకరిస్తా.. ఈ పురస్కారం మిగతావారిలో సేవాభావాన్ని, స్ఫూర్తిని కలిగిస్తే నాకు అంతకుమించిన సంతోషం ఏమీ లేదు..’ అని ఆయన ఎంతో వినమ్రంగా బదులిచ్చాడు.
గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ కటక్ పర్యటనకు వచ్చినపుడు ప్రకాశరావును ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. ఛాయ్‌వాలాగా ఉంటూ సమాజం కోసం, పేదపిల్లల కోసం పాటుపడుతున్న ఆయనను మోదీ అభినందించారు. ప్రతి నెలా ‘ఆకాశవాణి’లో ప్రధాని మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’లో ఓ సందర్భంగా ప్రకాశరావు సేవలను ప్రస్తుతించారు. ఈ ఛాయ్‌వాలాను స్ఫూర్తిగా తీసుకొని యువత సేవామార్గంలో పయనించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తనను స్వయంగా అభినందించడం తన జీవితంలో మరచిపోలేని గొప్ప సంఘటన అని, ఇంతకు మించిన గొప్ప అవార్డు ఏదీ ఉండదని ఈ ‘కటక్ ఛాయ్‌వాలా’ చెబుతున్నాడు. దేనినీ ఆశించకుండా సామాజిక సేవ చేస్తుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని ప్రకాశరావు అంటున్నాడు.