Others

ఇదిగో తెల్లచీర (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీ మూవీస్ సంస్థలో చలసాని గోపి నిర్మాతగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రం -ఊరికి మొనగాడు. సూపర్‌స్టార్ కృష్ణ ఇమేజ్‌ను అమాంతం పెంచేసిన చిత్రం. కృష్ణతో జయప్రద్ కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో మామ రావు గోపాలరావు పని పట్టడానికి అతని కూతురు జయప్రదతో నాటకమాడే సందర్భంలో వచ్చే పాటే -ఇదిగో తెల్లచీర. అదిగో మల్లెపూలు. సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన సందర్భానికి తగిన గీతంగా ఇది నాకెంతో ఇష్టం. తన కలానికి రెండువైపులా పదునేనన్నట్టు క్లాసిక్స్, మాసిక్స్ రాసిపడేసిన పండితుడు, సినీ గేయ రచయిత వేటూరి వ్రాసిన పాటను అద్భుతంగా బాణీ కట్టాడు సుస్వరాల చక్రవర్తి. ఎస్పీ బాలు, పి సుశీల గాత్రాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటశేఖర కృష్ణ, అందాల తార జయప్రద పాటకు తగిన అభినయాన్ని ప్రదర్శించటంతో ఆల్‌టైం రికార్డ్ సాంగ్ అయ్యింది -ఇదిగో తెల్లచీర. కాకి చేత పంపిస్తే కబురందిందా/ కళ్లారా చూడగానే కథ తెలిసిందా/ ఊరుకున్న ఊరుకోవు ఉవ్విళ్లు/ ఓపలేని పిల్లకయ్యె వేవిళ్ళు -ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.. అంటూ సాగే పాటను నృత్య దర్శకుడు సలీం మాస్టారు హీరో కృష్ణకు తగినవిధంగా రూపొందించి దృశ్యపరంగానూ అద్భుతం చేసేశారు.
హత్యకేసులో సాక్ష్యం చెప్పి రావు గోపాలరావును జైలుకు పంపుతాడు కాంతారావు. డబ్బుతో శిక్షనుంచి తప్పించుకున్న గోపాలరావు, ఓ టీచర్‌తో కాంతారావుకు అక్రమ సంబంధం అంటగడతాడు. అవమానాన్ని తట్టుకోలేక కాంతారావు ఇల్లొదిలి వెళ్లిపోతాడు. కష్టాలకోర్చి కొడుకు కృష్ణను ఇంజనీర్ చేస్తుంది తల్లి. పొగరుబోతు కూతురు జయప్రదను దారికితెచ్చి ఆమెను ప్రేమలో పడేసి, విలన్ రావు గోపాలరావుకు హీరో కృష్ణ ఎలా బుద్ధి చెప్పాడన్నది అసలు కథ. దర్శకుడు రాఘవేంద్రరావుకు ఏ సినిమాలోనైనా పాటను ఏ పీటపై కూర్చోబెట్టాలో బాగా తెలిసిన వాడు. అందుకే -ఈ పాటకూ ఓ రేంజ్ ఇచ్చి అత్యంత ప్రజాదరణ పొందిన పాటగా, మాస్‌మసాలా గీతంగా చిత్రీకరించారు. 1981లో విడుదలైన -ఊరికి మొనగాడు చిత్రం ఎప్పుడు చూసినా ఒకింత ఆనందాన్ని అందిస్తుంది.

-జి గౌరీగాయత్రి, ఉప్పల్