Others

అంతేమరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో లేడీ జేమ్స్‌బాండ్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆశించిన గుర్తింపు దక్కని అందమైన హీరోయిన్ సాక్షిచౌదరి. అరంగేట్రమే పెద్ద సినిమాలో హీరోయిన్‌గా వచ్చినా, అడపా దడపా ఆఫర్లతోనే ఇంకా కెరీర్ నెట్టుకొస్తుంది. ఆఫర్ రావడమే తరువాయన్నట్టు ఎలాంటి చిత్రాన్నైనా ఒప్పుకుంటున్నా, అందాల ఆరబోతకూ ప్రయత్నిస్తున్నా సరైన బ్రేక్ మాత్రం రాలేదు సాక్షికి. లక్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన సాక్షి, ఇప్పుడు సోషల్ మీడియాపై పడిందట. హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసి ఎంజాయ్ చేయమంటోంది. దీనిపై నెటిజన్లు శృతిమించిన ప్రశ్నలు వేయడంతో -సాక్షి గుర్రుమంటోంది. ఫొటోలు, వీడియోలకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఆ పిచ్చిలో పిచ్చి ప్రశ్నలూ సంధిస్తున్నారు. నా ఇన్ బాక్స్ పిచ్చి ప్రశ్నలతోనే నిండిపోతుంది. అయితే నేను డబ్బుకోసమే ఇండస్ట్రీకి వచ్చాననుకోవడం మీ మూర్ఖత్వం. పిచ్చి మెసెజ్‌లు పెడితే ఇబ్బందుల్లో పడతారు అంటూ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. ‘్ఫటోలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. చులకనగా చూడకండి’ అంటూ అప్పీల్ చేసిందనీ అంటున్నారు. నెటిజన్లు మాత్రం ఈ విషయంమీద రివర్స్ అవుతున్నారు. అలాంటి ఫొటోలు, వీడియోలు పెట్టడమెందుకు? చిరాకు ప్రశ్నలు అడిగించుకోవడమెందుకు? అంటున్నారు. ఔనుమరి, -అడుసు తొక్కనేల, కాలు కడగనేల? సాక్షిచౌదరి ప్రస్తుతం ‘మాగ్నెట్’ చిత్రం చేస్తోంది.